కొండగుహలో కొలువైన దేవుడు
రాముడిగా .. బలరాముడిగా ... వామనుడిగా ... కృష్ణుడిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు సాధ్యమైనంత వరకూ శాంతియుతంగానే ధర్మకార్యాలను చక్కబెట్టాడు. ఇక నరసింహస్వామి అవతారం విషయానికి వచ్చేసరికి, సహనం నశించిన దేవుడు సంహారానికి సిద్ధపడుతూ ఆగ్రహావేశాలతోనే అవతరించాడు. దుష్ట శిక్షణ చేసి శిష్టులకు తాను అండగా ఉంటానని చెప్పకనే చెప్పాడు.
అలాంటి నరసింహస్వామి లోక కల్యాణం కోసం అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అయితే తనని నేరుగా చూడటానికే భక్తులు జంకుతారని భావించి, లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని శాంతమూర్తిలా దర్శనమిస్తుంటాడు. ఆయన ఆవిర్భవించిన క్షేత్రాల్లో ఒకటిగా నల్గొండ జిల్లా మునగాల మండలంలోని 'రేపాల' దర్శనమిస్తుంది. ఇక్కడి గుట్టపై గల గుహలో అతి ప్రాచీనకాలం నుంచే స్వామివారు కొలువై ఉండవచ్చు. అయితే ఈ గుట్టపైకి వెళ్లినవారుగానీ, స్వామివారి జాడ తెలుసుకున్న వారుగాని లేరు.
అలాంటి పరిస్థితుల్లో నడిగూడెం మండలానికి చెందిన కీసర జమీందారుకి స్వామివారి కలలో కనిపించి, తన ఉనికిని తెలియజేశాడట. దాంతో ఆయన గ్రామస్తులతో కలిసి వెళ్లి స్వామివారు ఆవిర్భవించిన ప్రదేశాన్ని గుర్తించాడు. ఆనాటి నుంచి స్వామివారి నిత్యపూజలు జరిగేలా చూసి, భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయించాడు. ఆనాటి నుంచి ఇక్కడి ప్రజలకు స్వామివారితో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందరూ కూడా స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ ఉంటారు. అంకితభావంతో ఆయనని సేవించిన వారికి ఆపదలు రానేరావని విశ్వసిస్తూ ఉంటారు.
భద్రత కారణంగా స్వామివారి ఉత్సవ మూర్తులను 'సిరిపురం' లోని రామాలయంలో ఉంచి, బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగింపుగా తీసుకునివస్తారు. ఫాల్గుణ మాసంలో పాడ్యమి నుంచి 21 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. లక్ష్మీనరసింహ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు.