కేదారేశ్వర నోము
భార్యా భర్తలు ఆనందంగా ... అన్యోన్యంగా ఉండటానికి, కోరిన కోరికలు నెరవేరడానికి 'కేదారేశ్వరస్వామి నోము' చెప్పబడింది. సాక్షాత్తు ఈ నోమును గౌతమ మహర్షి సూచనమేరకు పార్వతీదేవి చేసి శంకరుడిలో సగభాగాన్ని పొంది ఆయనను అర్థనారీశ్వరుడిని చేసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
ఇక ఈ నోము మహాత్మ్యాన్ని తెలిపే కథను పరిశీలిస్తే, పేద కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమకి మంచి భర్త లభించాలనీ, తమని వారు ఎంతో అపురూపంగా చూసుకోవాలని ఆశించారు. అందుకు గాను కేదారేశ్వరస్వామి నోము నోచుకోవాలని అనుకున్నారు. పేదరికం అడ్డుపడుతున్నా శివయ్య పై భారం వేసి నోము పట్టారు. ఆ నోము ఫలితంగా ఆ ఇద్దరూ కూడా ఇద్దరు రాజులకు భార్యలై ఆనందకరమైన జీవితాన్ని గడపసాగారు.
అయితే ఆ ఇద్దరిలో అక్క మాత్రం క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 'భాద్రపద శుద్ధ అష్టమి' రోజున 21 పేటల పట్టుదారంతోగానీ ... పత్తి దారంగాని చేసిన తోరం కట్టుకుని కేదారేశ్వరస్వామి నోము నోచుకుంటూనే వుంది. కానీ చెల్లెలు మాత్రం సిరిసంపదలతో తులతూగుతూ ఆ నోమును గురించి పూర్తిగా మరిచిపోయింది. ఫలితంగా వారి కాపురంలో కలతలు రేగి, కొడుకుతో సహా ఆమెను ఆ రాజు రాజ్యం నుంచి బహిష్కరించాడు.
బిడ్డతో పాటు తన చెల్లెలు అడవిలో నానా అవస్థలు పడుతోందని తెలుసుకున్న అక్క, వెంటనే కేదారేశ్వర నోము నోచుకోమని ఆమెకి కబురు పంపించింది. అలాగే ఆమె పంపించిన ధనంతో ఆ చెల్లెలు ఆ నోమునోచుకుని అక్షింతలు తలపై ధరించింది. ఫలితంగా ఆమె భర్త మనసుమారి పశ్చాత్తాప పడ్డాడు. తన సైన్యంతో భార్యా బిడ్డలను వెదికించి వారిని అంతఃపురానికి రప్పించాడు. మునుపటిలానే వాళ్లంతా అన్యోన్యంగా అందమైన జీవితాన్ని కొనసాగించారు.