రామభక్తుల చెంతనే హనుమంతుడుంటాడా ?
రామ నామం ఎక్కడ వినిపిస్తూ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రామ భక్తులను ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, వారికి ఆయన తగిన విధంగా బుద్ధి చెబుతాడని అనేక మార్లు రుజువైంది. ఎక్కడ రాముడికి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నా అక్కడ హనుమంతుడు ఉంటాడనీ, ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటాడని రామాయణాన్ని తనదైన శైలిలో రచించిన 'మొల్ల' విషయంలోనూ నిర్ధారణ అయింది.
తెనాలి రామలింగడు చేసిన సూచనతో రామాయణ కావ్యాన్ని అయిదు రోజుల్లో రచించాలని మొల్ల నిర్ణయించుకుంటుంది. 'గోపవరం' గ్రామంలోని రామాలయంలోనే తన రామాయణ రచనకు శ్రీకారం చుడుతుంది. మొల్ల అంటే గిట్టని ఆ గ్రామ పెద్దలు ఈ విషయంలో ఆమె అభాసుపాలు కావడం ఖాయమని నవ్వుకుంటారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ, మొల్ల రామాయణం పూర్తి కావొస్తూ ఉంటుంది.
మొల్ల విషయం తెనాలి రామలింగడు ద్వారా తెలుసుకున్న కృష్ణదేవరాయలు ఆమెను అభినందించడానికి వస్తున్నాడనే సమాచారం గ్రామ పెద్దలకు చేరుతుంది. దాంతో ఆమె రామాయణ రచనకు అడ్డుపడాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రివేళ .. రామాయణ రచనలో నిమగ్నమై ఉన్న మొల్లపై ఒక్కసారిగా దాడిచేస్తారు. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ల ఎదురుగా హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు.
మొల్లపై దాడికి వచ్చిన వారిపై హనుమంతుడు ఒక్కసారిగా విరుచుకుపడతాడు. ఆగ్రహావేశాలతో ఊగి పోతున్న ఆయన భీకరమైన రూపాన్ని చూడలేక, ఆయన గదతో కొట్టే దెబ్బల బాధలు భరించలేక అంతా అక్కడి నుంచి తలో దిక్కుకి పారిపోతారు. అనుకున్న సమయానికి రామాయణ రచనను పూర్తి చేసిన మొల్ల, దానిని శ్రీకృష్ణదేవరాయలవారి సమక్షంలోనే శ్రీరాముడికి అంకితం చేస్తుంది.