ఏ దిక్కువైపుకు తలపెట్టి నిద్రించకూడదు ?
సాధారణంగా ఏ మాత్రం కాస్త వాస్తు పరిజ్ఞానం ... ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఎవరింటికి వెళ్లినా, తమ ఇంట్లోని వస్తువులన్నీ ఉండవలసిన చోటునే ఉన్నాయోలేదో చెప్పమని ఆ ఇంటిగల వాళ్లు అడుగుతుంటారు. పూజామందిరం ఉండవలసిన చోటు ... బీరువా పెట్టవలసిన స్థానం తరువాత వాళ్లు అత్యధిక ప్రాధాన్యం పడకగదికే ఇస్తారు. నిద్రించేటప్పుడు తల ఏ దిక్కువైపుకి పెట్టాలంటూ అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం కాస్త శాస్త్రపరిజ్ఞానం ఉన్న వాళ్లైనా 'ఉత్తరం దిక్కు' వైపుకు మాత్రం తలపెట్టి నిద్రించవద్దని చెబుతుంటారు.
ఇక ఇదే మాటని పూర్వీకులు తమ తరువాత తరాలవారికి చెబుతూనే వస్తున్నారు. పార్వతీదేవి సృష్టించిందనే విషయం తెలియక, తనని నిలువరించిన వినాయకుడిపై కోపంతో అతని తలను శివుడు ఖండిస్తాడు. ఆ తరువాత విషయం తెలుసుకుని, ఉత్తరం దిశగా తలపెట్టి పడుకున్న వారి శిరస్సును ఖండించి తీసుకు రావలసిందిగా తన గణాన్ని ఆదేశిస్తాడు.
ఆ సమయంలో ఆ దిక్కువైపు తలపెట్టి ఓ ఏనుగు పడుకుని ఉంటుంది. దాంతో వాళ్లు దాని తలను ఖండించి తీసుకురాగా, ఆ శిరస్సును వినాయకుడి మొండానికి అమర్చుతాడు పరమశివుడు. ఉత్తరం దిక్కువైపు తల పెట్టి ఎందుకు నిద్రించరాదనే ప్రశ్నకు చాలామంది పై కథనే చెబుతుంటారు. ఉత్తరం దిక్కువైపు తలపెట్టి పడుకునేవారు దైవాపరాథం చేసినట్టు అవుతుందనీ, వాళ్లు దేవుడి ఆగ్రహానికి గురవుతారని అంటారు.
ఈ సందేహానికి సంబంధించి శాస్త్రాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. సాధారణంగా భగవంతుడు ఆవిర్భవించిన పుణ్యక్షేత్రాలన్నీ కూడా దక్షిణ దిశగానే కొలువుదీరి ఉంటాయి. ఉత్తరం వైపున తలపెట్టి పడుకుంటే ... భగవంతుడి ఆలవాలమైన దక్షిణంవైపు కాళ్లు పెట్టినట్టు అవుతుంది. ఇది మహా అపచారం కనుక ఉత్తరం వైపున తలపెట్టకూడదనే భావన, తరతరాలుగా ఒక నియమంగా ... ఆచారంగా పాటిస్తూ రావడం జరుగుతోంది.