మాఘగౌరీ నోము
స్త్రీ పసుపు కుంకుమలను కాపాడే నోముగా 'మాఘగౌరీ నోము' చెప్పబడుతోంది. ఈ నోమును మాఘమాసంలో అమావాస్య వెళ్లిన పాడ్యమి రోజున మొదలు పెట్టి, మళ్లీ వచ్చే అమావాస్య తరువాత పాడ్యమి వరకూ అంటే .. 30 రోజుల పాటు చేయవలసి వుంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే నదిలో గానీ ... ప్రవహించే కాలువలోగాని స్నానం చేయాలి. ఒడ్డున పసుపుతోను ... కుంకుమతోను ... పిండితోను ఐదేసి పద్మాలు గీసి మధ్యలో పసుపు ముద్దతో చేసిన 'గౌరీదేవి'ని వుంచి పూజించాలి.
ఈ నోమును చేపట్టిన మొదటి సంవత్సరం కిలోంబావు పసుపును ... రెండో సంవత్సరం కిలోంబావు కుంకుమను ... మూడవ సంవత్సరం ... కిలోంబావు ఎండు కొబ్బరిని ... నాల్గొవ సంవత్సరం కిలోంబావు బెల్లం ... ఐదో సంవత్సరం కిలోంబావు జీలకర్రను వాయనదానమివ్వాలి. ఇక అయిదు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత అయిదుగురు ముత్తయిదువులను పేరంటానికి పిలిచి భోజనాలు పెట్టాలి. అయిదేళ్లుగా ఇస్తూ వచ్చిన వాయన దానాలను ఆ రోజు కూడా వాయనమిచ్చి పసుపు గౌరీని నీటిలో నిమ్మజ్జనం చేయడంతో ఉద్యాపన చెప్పుకున్నట్టు అవుతుంది.
ఇక ఈ నోము ఎంతటి మహిమాన్వితమైనదో తెలియజెప్పే కథ ఒకటి ప్రచారంలో వుంది. ఓ గ్రామంలో నివసిస్తోన్న బ్రాహ్మణ దంపతులు పెళ్లీడు రాగానే తమ కూతురుకి పెళ్లి చేశారు. కొంత కాలం తరువాత అనుకోకుండా ఆమె భర్త సముద్రంలో కొట్టుకుపోయాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. కూతురు బాధ చూడలేక గాలి మార్పు కోసం ఆమెను వెంటబెట్టుకుని తీర్థ యాత్రలకు బయలుదేరారు.
అలా కొన్ని రోజుల పాటు తీర్థ యాత్రలు చేసిన వారికి ఓ నదీ తీరంలో ఓ పండు ముత్తయిదువ కనిపించింది. అక్కడ ఒక వైపున ముత్తయిదువులు ... మరో వైపున వితంతువులు పూజా కార్యక్రమాలకి సంబంధించిన పనుల్లో ఉన్నారు. ఆ పండు ముత్తయిదువును సాక్షాత్తు పార్వతీదేవిగా భావించి ఆ యువతి చేతులు జోడించి నమస్కరించింది.
ఆ యువతి ఆవేదనను అర్ధం చేసుకున్న ఆ పండు ముత్తయిదువ, ఆమె భక్తి శ్రద్ధలను పరీక్షించి 'మాఘగౌరీ నోము' నోచుకోమని సూచించింది. ఇంటికి వచ్చిన ఆ యువతీ, తల్లిదండ్రుల సహకారంతో ఆ నోమును నోచుకుని ఉద్యాపన చెప్పుకుంది. ఫలితంగా .. సముద్రంలో కొట్టుకుపోయాడనుకున్న ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. ముందుగా ఆ విషయాన్ని ఆ ఊళ్లో వాళ్లు నమ్మకపోయినా ఆ తరువాత ఆశ్చర్యపోయారు. తాము కూడా ఈ నోము నోచుకుని అమ్మవారి అనుగ్రహంతో తరించారు.