ప్రార్ధించిన వెంటనే ప్రత్యక్షమైన జగన్మాత
కొల్లూరు శ్రీ మూకాంబిక అమ్మవారి గురించి తెలియని వారుండరు. యుగయుగాలుగా ఇక్కడి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నట్టు చెప్పబడుతోంది. ఇక్కడ అమ్మవారు ఆవిర్భవించడం వెనుక పురాణపరమైన కథనం ఒకటి ఆసక్తికరంగా వినిపిస్తుంది. పరమశివుడి సాక్షాత్కారాన్ని పొందిన 'కోలమహర్షి' ... ముక్కోటి దేవతలను ఈ ప్రదేశంలో పూజించుకునే అవకాశాన్ని సాధారణ ప్రజలకు కూడా కలిగించమని ప్రార్ధించాడట.
దాంతో శివుడు మధ్యలో 'స్వర్ణరేఖ' గల ఒక శివలింగాన్ని ఆయనకి ప్రసాదిస్తాడు. ఆ స్వర్ణ రేఖకి ఒకవైపున లక్ష్మీదేవి .. సరస్వతీదేవి .. దుర్గాదేవి ఉంటారనీ, మరో వైపున బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులు ఉంటారని చెబుతాడు. ఇది శక్తి ప్రధానమైన శివలింగమనీ ... ముక్కోటి దేవతలు ఇందులోనే ఉంటారని అంటాడు. ఈ శివలింగాన్ని పూజించడం వలన సకల శుభాలు చేకూరతాయని చెబుతాడు. అలా ఆవిర్భవించిన ఇక్కడి స్వయంభువు శివలింగాన్ని విశేష సంఖ్యలో భక్తులు ఆరాధిస్తూ ఉండటం ప్రారంభించారు.
అయితే గర్భాలయంలో లింగరూపం మాత్రమే ఉండటం వలన ... అమ్మవారి విగ్రహరూపం లేకపోవడం వలన జగన్మాతకు ప్రత్యేకమైన ప్రాధాన్యత లేకుండాపోయింది. లింగరూపంలో ఒకవైపున త్రిశక్తి మాతలు ఉన్నారనే విషయం కాలక్రమంలో మరుగునపడిపోయింది. ఆ విషయాన్ని ఈ క్షేత్రాన్ని దర్శించిన ఆదిశంకరాచార్యుల వారు గ్రహించారు. స్వర్ణరేఖ గల శివలింగంలోని ఒక భాగం నుంచి అత్యంత శక్తిమంతమైన తరంగాలు వెలువడుతుండటం ఆయన గమనించారు.
జగన్మాత అయిన అమ్మవారు శివలింగంలో అంతర్భాగంగా ఉండటం శంకరాచార్యులవారు చూశారు. త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమ్మవారు అక్కడ ఏ రూపంలో నిక్షిప్తమై వుందో తెలుసుకోగోరుతున్నట్టు ఆయన ఆ తల్లికి విన్నవించారు. అంతే ఆ తల్లి శంఖు చక్రాలను ధరించి ... అభయ - వరద హస్తాలతో .. పద్మాసనంపై కూర్చుని ఆయన ముందు ప్రత్యక్షమవుతుంది.
ఈ క్షేత్రంలో ఆమె కొలువై ఉన్న రూపాన్ని చూసిన శంకరులవారు, ఆ రూపాన్ని గుర్తుపెట్టుకుని పంచలోహ మూర్తిని తయారు చేయించినట్టు స్థలపురాణం చెబుతోంది. ప్రస్తుతం భక్తులు దర్శించుకుని పూజించికునే మూకాంబిక అమ్మవారి ప్రతిమ అదే. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం కనుకనే ఇక్కడి అమ్మవారు భక్తులపట్ల కరుణామృతాన్ని వెదజల్లుతోంది ... అందుకు తగిన విధంగానే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ ఉంది.