పార్వతీ సమేత భీమలింగేశ్వర క్షేత్రం
శివలీలా విశేషాలను గురించి ఎంతగా చెప్పుకున్నా తనివితీరదు. లోకాలకు శుభాలను కలగజేయడమేగానీ, లోపాయకారిగా వ్యవహరించడం ఆయనకి చేతకాదు. దుష్టులను శిక్షించడం ... శిష్టులను రక్షించడంలో వేగంగా వ్యవహరిస్తాడు కానీ, దూరాలోచన చేసినట్టుగా ఎక్కడా కనిపించడు. ఆవిర్భవించడమైనా ... అనుగ్రహించడమైనా చకచకా చేసేయడమే ఆయనకి తెలుసు. అందుకే ఆయనని అంతా బోళాశంకరుడు అని పిలుచుకుంటూ ఉంటారు.
అలాంటి ఆదిదేవుడు కొలువైన అనేక క్షేత్రాల్లో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఒకటిగా కనిపిస్తుంది. ప్రాచీనకాలంనాటి ఈ క్షేత్రంలో 'పార్వతీ సమేత భీమలింగేశ్వరుడు' కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. సాధారణంగా ఈ పరిసర ప్రాంతాలలో కాకతీయ ప్రభువుల కాలంనాటి శివాలయాలు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడి ఆలయం అంతకన్నా ముందే నిర్మించబడింది. 11 వ శతాబ్దం తొలినాళ్లలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగా శాసనాలు చెబుతున్నాయి.
ఆ తరువాత కాలంలో ఈ ఆలయం విశిష్టత గురించి తెలుసుకున్న కాకతీయులు దీని అభివృద్ధిలో ప్రధానమైన పాత్రను పోషించారు. అలనాటి వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే ఈ క్షేత్రానికి శివరాత్రి పర్వదినాన భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల్లోనూ ... ఉత్సవాలలోను అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఆదిదంపతుల దర్శనం చేసుకుని కానుకలు సమర్పిస్తుంటారు. అనంతమైన పుణ్యఫలాలను సొంతం చేసుకుంటూ ఉంటారు.