ఆకాశలింగం ప్రత్యేకత
పంచభూత లింగాలలో ఆకాశలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం తమిళనాడు - చిదంబరంలో కనిపిస్తుంది. ఆకాశమంటే అనంతమైన శూన్యం తప్ప మరేమీ కనిపించదు. అలాగే ఈ క్షేత్రంలోని గర్భాలయంలో స్వామివారు ఉన్నట్టుగా చెప్పబడుతున్న చోట శూన్యమే తప్ప ఏమీ కనిపించదు. 'చిదంబర రహస్యం' అనే మాట ఇక్కడ నుంచి పుట్టినదే.
ఇక ఇదే గర్భాలయంలో నిరాకారుడైన స్వామితో పాటు స్పటిక లింగరూపంలో గల చంద్రమౌళీశ్వరుడు ... నటరాజస్వామి దర్శనమిస్తారు. మరకతంతో చేసిన నటరాజస్వామికి ... స్పటికలింగ రూపంలో గల చంద్రమౌళీశ్వరస్వామికి అభిషేకాలు జరుగుతుంటాయి. ఆదిశేషుడి అభ్యర్థన మేరకు శివుడు ఆనందతాండవం చేసి చూపించినది ఈ ప్రదేశంలోనేనని స్థలపురాణం చెబుతోంది. అసుర సంహారం అనంతరం ఆనందతాండవం జరిగినట్టుగా, నటరాజస్వామి పాదాల కింద ఆ అసురుడు కనిపిస్తుంటాడు.
దాదాపు 40 ఎకరాల విస్తీర్ణం .. తొమ్మిది ద్వారాలు ... నాలుగు రాజగోపురాలు గల ఈ క్షేత్రంలో, ఆణువణువూ శిల్పకళా శోభితమై విలసిల్లుతూ ఉంటుంది. ఈ క్షేత్ర మహిమ కారణంగా సామాన్యులు సైతం అసమానమైన భక్తులుగా ... పండితులుగా మారిన వైనం స్థల పురాణంగా మనకి వినిపిస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడవలసినదిగా ఈ క్షేత్రం తన ప్రత్యేకతను ... విశిష్టతను చాటుకుంటోంది.