కార్తీక ఆదివారం
వివాహం కావలసిన కన్నెపిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఆచరించదగిన నోములలో 'కార్తీక ఆదివారాల నోము'ఒకటి. ఈనోము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని చాటిచెప్పే కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఓ రాజ కుటుంబీకులు యుక్త వయసులోకి అడుగు పెట్టిన తమ కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురికావడంతో, ఆ దంపతులు ఆందోళన చెందారు. క్రమేణా ఆమె వ్యాధి అంటువ్యాధిగా మారడంతో, ఆమెను ఊరు చివరనున్న ఓ భవనంలో ఉంచసాగారు.
ఓదార్పు లేని ఒంటరి తనాన్ని తలచుకుని ఆ రాకుమారి నిత్యం కన్నీళ్ల పర్యంతమవుతూ వుండేది. గతంలో ఆమె పార్వతీ పరమేశ్వరులను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచిన కారణంగా, ఆది దంపతులు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు. గతజన్మలో చేసిన పాపాల కారణంగా ఆమెకి ఆ వ్యాధి సోకిందనీ, 'కార్తీక ఆదివారాల నోము' పడితే ఆ వ్యాధి బారినుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ నోము ఎలా నోచుకోవాలనేది వివరించారు.
దాంతో ఆమె తాను ఉంటోన్న చోటునే ఆ నోము నోచుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకుంది. కార్తీక మాసం రాగానే మొదటి రోజున ఉదయాన్నే తల స్నానం చేసి, తను పట్టిన నోము విజయవంతం కావాలని సూర్య భగవానుడికి నమస్కరించి 12 పోగులుగల తోరము కట్టుకుంది. కార్తీక మాసమంతా కూడా నువ్వులు ... నూనె సేవించకుండా సూర్య భగవానుడిని అర్చిస్తూ, పాలు - పండ్లును నైవేద్యంగా సమర్పించింది.
ఈ విధంగా మూడు సంవత్సరాల పాటు ఈ నోమును నోచుకున్న తరువాత, బంగారంతో చేసిన సూర్య భగవానుడి ప్రతిమను పూజించి, దక్షిణ తాంబూలాలతో సహా దానిని బ్రాహ్మణుడికి వాయనదానమిచ్చింది. ఫలితంగా రాకుమారి వ్యాధి రోజు రోజుకి తగ్గు ముఖం పడుతూ పూర్తిగా నయమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న రాజ దంపతులు వెంటనే తమ కూతురు దగ్గరికి వచ్చారు. రాకుమారి మునుపటికన్నా అందంగా వుండటం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్య పోయారు.
కన్నకూతురును తాము దూరం చేసుకున్నా ... ఆది దంపతులు అనుగ్రహించినందుకు వాళ్లు ఆనందంతో పొంగిపోయారు. తమ కూతురును తమవెంట అంతఃపురానికి తీసుకువెళ్లి స్వయం వరాన్ని ఏర్పాటు చేశారు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కారణంగా ఆమెకి అందగాడు ... పరాక్రమవంతుడు అయిన భర్త లభించాడు. ఈ నోము నోచుకున్న వారు ఈ కథను చదువుకుని అక్షింతలు తలపై ధరించవలసి వుంటుంది.