శివలింగంలో ఊరుతోన్న నీళ్లు !
ఆదిదేవుడు అభిషేకప్రియుడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన అంతగా అభిషేకాన్ని ఇష్టపడటం వెనుక బలమైన కారణమే కనిపిస్తుంది. అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు, ముందుగా కాలకూటవిషం వెలువడింది. ఆ విషం లోకాలను దహించివేయగలదని గ్రహించిన శివుడు, దానిని నేరేడుపండంత చేసి మింగేసి కంఠంలోనే నిలిపేస్తాడు.
ఆ విషం నుంచి పుట్టే వేడిని తట్టుకోవడంకోసమే ఆయన మంచుకొండలను నివాసంగా చేసుకోవలసివస్తుంది. చల్లదనంకోసం గంగాదేవిని ... చంద్రుడిని తలపై పెట్టుకోవలసివస్తుంది. ఈ నేపథ్యంలో భూమిపై ఎక్కడ వెలసినా అక్కడ చల్లదనం ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు తనలో నుంచే గంగను పొంగిస్తూ ఉపశమనాన్ని పొందుతూ ఉంటాడు.
అలాంటి మహిమాన్వితమైన క్షేత్రం మనకి నల్గొండ జిల్లా 'మేళ్లచెరువు'లో కనిపిస్తుంది. ఇక్కడ శివుడు స్వయంభువుకాగా, అమ్మవారు 'ఇష్టకామేశ్వరీదేవి' గా పూజలు అందుకుంటోంది. అనేకమంది మహర్షులచే పూజించబడిన ఇక్కడి శివలింగం, 11వ శతాబ్దం తొలినాళ్లలో తిరిగి వెలుగు చూసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి గర్భాలయంలో గల శివలింగానికి పైభాగంలో 'రంధ్రం' ఉంటుంది. ఈ రంధ్రంలో నిరంతరం నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ నీరు స్వచ్ఛంగా ... చల్లగా ... పవిత్రంగా ... తియ్యగా ఉండటం విశేషం.
వందల అడుగుల లోతున బావులు తవ్వించినా ఈ ప్రాంతంలో నీళ్లు పడవని స్థానికులు చెబుతుంటారు. అలాంటిది ఈ శివలింగంలో నుంచి నీళ్లు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయన్నది ఎవరికీ అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక ఈ శివలింగం కూడా పెరుగుతూ వస్తోందనడానికి తగిన ఆధారాలు కనిపిస్తుంటాయి. ఈ కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావిస్తూ, విశేషమైన రీతిలో భక్తులు స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి రోజున ఉపవాస జాగరణాలతో ఆ దేవదేవుడి మనసును గెలుచుకుంటూ ఉంటారు.