పరమశివుడు వెలసిన పవిత్ర క్షేత్రం
సీతారాములు వనవాసకాలంలో అనేక ప్రదేశాలలో శివలింగాలను ప్రతిష్ఠించి పూజించారు. అవన్నీ కూడా నేడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో ఒకటిగా నల్గొండ జిల్లాకి చెందిన 'అడవిదేవులపల్లి' కనిపిస్తుంది. శ్రీరాముడు వివాహానికి ముందు ... ఆ తరువాత ఈ ప్రదేశాన్ని దర్శించడం ఇక్కడి విశేషంగా చెప్పబడుతోంది.
యజ్ఞ యాగాదులకు ఆటంకాన్ని కలిగిస్తోన్న 'తాటకి'ని సంహరించడానికిగాను రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు బయలుదేరుతాడు. వాళ్లు ఈ ప్రదేశానికి చేరుకునే సరికి బాగా పొద్దుపోవడంతో ఇక్కడి కృష్ణానది తీరంలో బసచేశారు. మరునాడు ఉదయం కృష్ణా నదిలో స్నానం చేసిన రాముడు, పూజ చేసుకోవడం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగాన్నే నేడు భక్తులు దర్శించి తరిస్తున్నారు.
ఇక వివాహమైన తరువాత సీతాదేవితో కలిసి వనవాసం నిమిత్తం ఈ ప్రదేశానికి వచ్చిన శ్రీరాముడు, ఇక్కడే కాకాసురుడిని సంహరించినట్టు స్థలపురాణం చెబుతుంది. ఈ విశ్వాసాన్ని బలపరుస్తూ ఈ ప్రదేశంలో ఒక్క కాకి కూడా కనిపించదు. ఆ తరువాత ఈ ప్రాంతం అనేక మంది రాజుల ఏలుబడిలోకి వెళ్లింది. వారిలో కల్యాణి చాళుక్య రాజులు ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేశారు.
ఇక్కడ పార్వతీదేవితో పాటు చెన్నకేశవస్వామిని ... సూర్యుడిని ... గణపతిని ప్రతిష్ఠించి దీనిని పంచాయతన క్షేత్రంగా తీర్చిదిద్దారు. శిల్పకళా శోభితమైన ఈ ఆలయం, ఆనాటి రాజుల భక్తి శ్రద్ధలకు అద్దంపడుతుంది. ప్రతి యేటా ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆనందోత్సాహాలతో ఆదిదంపతులను సేవిస్తూ తన్మయత్వంతో తరిస్తుంటారు.