అగ్నిలింగం ప్రత్యేకత
మహాశివుడు అగ్నికి ప్రతీకగా ... తేజో రూపాన ఆవిర్భవించిన క్షేత్రం మనకి తమిళనాడుకి చెందిన 'తిరువణ్ణామలై'లో దర్శనమిస్తుంది. పంచభూత లింగాలలో అగ్నిలింగానికి గల ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తమలో ఎవరు గొప్ప అనే విషయంగా బ్రహ్మదేవుడు ... శ్రీ మహావిష్ణువు వాదోపవాదాలు చేస్తూ ఉండటంతో, దానికి పరిష్కారంగా పరమశివుడు తేజో లింగంగా ఈ ప్రదేశంలోనే ఆవిర్భవించాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి కారణమైన సంఘటన ఇదే.
మహాశివుడు అగ్ని రూపంగా ఆవిర్భవించిన ఇక్కడి కొండను 'అరుణగిరి' గా పిలుస్తుంటారు ... స్వామిని 'అరుణాచలేశ్వరుడు' గా ... అమ్మవారిని 'ఉణ్ణామలై'(అపర్ణ) గా కొలుస్తుంటారు. 25 ఎకరాల విస్తీర్ణంలో .. 7 ప్రాకారాలను కలిగి .. 11 అంతస్తుల రాజగోపురంతో .. 217 అడుగుల ఎత్తులో ఈ క్షేత్రం విలసిల్లుతూ ఉంటుంది. పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది.
ప్రతియేటా కార్తీకమాసంలో పౌర్ణమి రోజున స్వామివారి దర్శనం కోసం దేవతలు వస్తారని స్థలపురాణం చెబుతోంది. ఈ సందర్భంగా కొండపై ఓ పెద్ద పాత్రలో వెయ్యి కిలోల నెయ్యిపోసి ... వెయ్యిగజాల పత్తి వత్తిని వేసి అఖండ దీపారాధన చేస్తుంటారు. ఈ దీప దర్శనం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని అంటారు. 12 కిలోమీటర్ల పరిథి గల ఈ అరుణగిరిని ప్రదక్షిణ క్రమంలో చుట్టిరావడం వలన అనేక వ్యాధులు నివారించబడతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
కంచిలో జన్మించడం వలన ... కాశీలో మరణించడం వలన ఎలాంటి విశేష ఫలితాలు కలుగుతాయో, అరుణాచలం గురించి ఆలోచించడం వల్లనే అంతటి ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పంచభూత లింగాలలో ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శించడం వలన మిగతా క్షేత్రాలను కూడా దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి.