చెరువు గట్టుపై చెన్నకేశవుడు
లోక కల్యాణం కోసం భగవంతుడు అనేక రూపాలతో ... అనేక నామాలతో ... వివిధ ప్రాంతాలలో ఆవిర్భవించాడు. భక్తులకి తన ఉనికిని తెలుపుతూ ... మిగతావారికి తన మహిమలు చాటుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనేక ఆలయాలు నిర్మించబడుతూ ... ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా 'ఉల్లిపాలెం' తన ఘనతను చాటుకుంటోంది.
పవిత్ర కృష్ణానది పరివాహక ప్రాంతంలోగల ఉల్లిపాలెం గ్రామంలో పూర్వం శైవుడైన ఓ భక్తుడు వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. అందుకోసం ఆయన ఆలయాన్ని నిర్మించి ... వేణుగోపాలుడి విగ్రహాన్ని కూడా తయారుచేయిస్తాడు. అయితే అందులో శివలింగాన్నే ప్రతిష్ఠించాలని మిగతావాళ్లు పట్టుపడతారు. దాంతో ఈ వ్యవహారంలో ఆ ఊరు జమీందారు జోక్యం చేసుకుంటాడు. వివాదం తగ్గుముఖం పట్టిన తరువాత ఆలోచించవచ్చని వేణుగోపాలస్వామి విగ్రహాన్ని తన అధీనంలో ఉంచుతాడు.
ఆ రోజు రాత్రి ఆయనకు కలలో చెన్నకేశవస్వామి కనిపించి, తాను 'అల్లపర్రు'లో చెరువుగట్టుపై ఉన్నాననీ, ఉల్లిపాలెంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో తనని ప్రతిష్ఠించమని ఆదేశించాడట. మరునాడు ఉదయమే ఆ పక్కనే గల 'అల్లపర్రు' గ్రామానికి జమీందారు వెళతాడు. చాలాకాలం క్రితమే ఆ ఊళ్లో చెరువు తవ్వుతుండగా చెన్నకేశవస్వామి ప్రతిమ బయటపడిందనీ, దానిని గట్టునే ఉంచి పూజిస్తున్నారని తెలుసుకుంటాడు. ఆ రెండు గ్రామాల వారికి తన కలను గురించి చెప్పి, ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఉల్లిపాలెంలోని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు.
ఆ తరువాత ఇదే ప్రాంగణంలో వేణుగోపాలస్వామిని కూడా ప్రతిష్ఠిస్తాడు. కాలక్రమంలో ఇక్కడ శివ పార్వతులు కూడా కొలువుదీరడం జరిగింది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి ఏడాది చెన్నకేశవస్వామికి కల్యాణోత్సవం నిర్వహించాక, స్వామివారిని అల్లపర్రు తీసుకుని వెళ్లి గ్రామోత్సవం జరపడం ఆనాటి నుంచి ఆనవాయతీగా వస్తోంది. ఈ గ్రామోత్సవంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సంతోషంగా పాల్గొంటారు ... హరిహరుల అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు.