దైవానుగ్రహమంటే ఇదే !
భగవంతుడి అనుగ్రహమే ఉంటే దారిద్ర్యంతో బాధపడేవాళ్లు ధనవంతులు కావడం, వ్యాధి పీడితులు ఆరోగ్యవంతులు కావడం ... అల్పాయుష్కులు ఆయుష్షును పొందడం అనేక సందర్భాల్లో జరిగింది. అలాగే గొర్రెలకాపరి అయిన కాళిదాసు ... తాను కూర్చున్న కొమ్మనే నరికిన అమాయకుడైన కాళిదాసు దైవానుగ్రహంతో మహాపండితుడు అయ్యాడు. ఇంచుమించు ఇదే తరహాలో నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన 'ఇద్దన్న' అనే పామరుడు కూడా పండితుడైనట్టు చరిత్ర చెబుతోంది.
పూర్వం ఇద్దన్న అనే వ్యక్తి చదువు సంధ్యలు లేనికారణంగా ఆ పనీ ఈ పని చేస్తూ పొట్టపోసుకుంటూ ఉండేవాడు. ఓ రోజున ఆయన తాను చేసే పనుల్లో భాగంగానే పొలానికి నీళ్లు పెట్టసాగాడు. ఆ సమయంలో కొంతమంది సాధువులు ఆ దారి మీదుగా వెళ్లడం చూస్తాడు. వాళ్లు ఏదో మననం చేసుకుంటున్నట్టుగా ముందుకు వెళుతూ ఉండటంతో, విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో అనుసరిస్తాడు.
'తుంగతుర్తి' సమీపంలో గల శివాలయానికి వెళ్లి వాళ్లు స్వామిని ఆరాధిస్తూ ఉండటం చూస్తాడు. వాళ్లు భజన చేస్తూ ఉంటే తనని తాను మరిచిపోతాడు. ఆయన గురించిన వివరాలను సాధువులు అడిగి తెలుసుకుంటారు. తనకి కూడా దేవుడి ముందు నుంచుని వాళ్లలా చదువుతూ దణ్ణం పెట్టుకోవాలని ఉందని అంటాడు ఇద్దన్న. ఏమీ చదువుకోకపోయినా అంతలా ఆయన భక్తిలో లీనం కావడం సాధువులను ఆశ్చర్యపరుస్తుంది.
దాంతో వాళ్లు శివుడి సన్నిధిలోని విభూతిని ఇద్దన్న నాలికపై ఉంచి మంత్రోపదేశం చేస్తారు. అంతే ఆ క్షణమే ఆయనలో జ్ఞాన కుసుమం వికసించి కవితా శక్తి పెల్లుబుకుతుంది. ఆయన నోటివెంట ఆశువుగా ... అలవోకగా అనేక తత్త్వగీతాలు వెలువడతాయి. కష్టం చేయడం మాత్రమే తెలిసిన ఇద్దన్న .. కవిత్వం చెబుతూ 'ఇద్దాసు'గా మారిపోతాడు. జీవితంలో లోతైన విషయాలను అనుభవపూర్వకంగా ఆవిష్కరించినట్టు అనిపించే ఆయన గీతాలు, సామాన్యులు సైతం అర్థం చేసుకుని హాయిగా పాడుకోవడం మొదలుపెడతారు.
అలా జనాన్ని జ్ఞాన మార్గంలో నడిపించిన ఇద్దన్న మహాయోగిగా ప్రసిద్ధి చెందుతాడు. మహిమాన్వితమైన ఈ సంఘటనకు నిదర్శనంగా ఆయన సమాధి దర్శనమిస్తుంది. ఇప్పటికీ ఇక్కడ అశేష భక్త జనవాహిని మధ్య ఆయన పేరున ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి.