జలలింగం ప్రత్యేకత
పంచభూత లింగాలలో జలలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది ... మరెంతో ప్రాధాన్యత ఉంది. పరమశివుడు జలతత్త్వాన ఆవిర్భవించాడు కనుక, ఇక్కడి శివలింగం పాదభాగం నుంచి అదే పనిగా నీరు ఊరుతూ ఉంటుంది. ఈ కారణంగానే 'తిరునైకావల్' (జంబుకేశ్వరం) ప్రాంతవాసులు ఆదిదేవుడిని 'నీర్ తిరళ్ నాథర్' పేరుతో కొలుస్తుంటారు.
తనని నిత్యం అర్చించాలని ఉందని చెప్పిన శంభుడు అనే భక్తుడిని పరమశివుడు అనుగ్రహిస్తూ, అందుకు అనుకూలంగా అతనిని జంబూ వృక్షంలా మార్చివేశాడని స్థలపురాణం చెబుతోంది. అందుకు నిదర్శనంగా స్వామివారి సన్నిధిలో జంబూ వృక్షం దర్శనమిస్తూ ఉంటుంది. ఇది ఎంతో మహిమాన్వితమైన క్షేత్రమనీ, ఈ కారణంగానే ఆదిదేవుడు అమ్మవారికి ఇక్కడ జ్ఞానోపదేశం చేశాడని చెబుతారు.
ఇందుకు బలాన్ని చేకూరుస్తూ ఈ క్షేత్రంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటే, అఖిలాండేశ్వరీ దేవిగా పిలవబడుతోన్న అమ్మవారు తూర్పుముఖంగా కనిపిస్తుంది. అయ్యవారికి అమ్మవారికి మధ్య గురువుకీ శిష్యురాలికి మధ్య గల సంబంధం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఇక్కడ ఇతర క్షేత్రాల్లో మాదిరిగా శివపార్వతులకు కల్యాణోత్సవం జరపరు. ఉమాశంకరులకు కల్యాణోత్సవం జరిపించబడని ఏకైక క్షేత్రంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇక భక్తులను ఆశ్చర్యచకితులను చేసే మరో ఆచారం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఆలయ అర్చకుడు చీరకట్టుకుని ... కళ్లకి కాటుక పెట్టుకుని జంబుకేశ్వర స్వామిని అర్చిస్తాడు. అత్యంత విశిష్టమైనదిగా పురాణాలు ప్రస్తావిస్తోన్న ఈ క్షేత్రం, భక్తులతో నిత్యం రద్దీగానే కనిపిస్తుంది. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ క్షేత్రానికి చేరుకునే భక్తుల సంఖ్య విశేషంగా ఉంటుంది.
మహాశివుడి లింగోద్భవకాల సమయంలో పంచభూత లింగాలలో ఒకటైన జలలింగ క్షేత్రాన్ని దర్శించడం వలన విశేష పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది. జీవితంలో ఒకే ఒక్కసారి అదీ శివరాత్రి రోజున ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన కలిగే పుణ్యఫలం వేలజన్మలపాటు వెంటవస్తుందని అంటారు. అందుకే ఈ రోజున ఘనదైవమైన ఆ గంగాధరుడిని దర్శిస్తూ ... స్మరిస్తూ ... తరిస్తుంటారు.