గండాలు తొలగించే శివ క్షేత్రం
లోకాలను రక్షించడం కోసం శివుడు హాలాహలాన్ని తన గరళంలో దాచుకుని గరళకంఠుడు అయ్యాడు. సమస్త జీవరాశిని కాపాడటం కోసం విషాన్ని సైతం అమృతంలా తాగాడు కనుకనే, శివుడంటే భక్తులకు అపారమైన అభిమానం ... అనంతమైన భక్తిశ్రద్ధలు ఉంటాయి. దయ - కరుణ అనే రెండు మాటలకు రూపన్నిస్తే ఆ రూపం శివుడిదే అవుతుంది. అలాంటి పరమశివుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నాడు.
ఈ జాబితాలోనే కరీంనగర్ జిల్లాకి చెందిన 'ఓదెల' కనిపిస్తుంది. 'ఓదేలు' అనే భక్తుడి కారణంగా ఇక్కడి శివుడు వెలుగులోకి వచ్చాడు కనుక, ఈ ఊరుకి ఈ పేరు వచ్చిందని అంటారు. మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో శివుడు ... మల్లికార్జునుడు పేరుతోను అమ్మవారు భ్రమరాంబగాను పూజలందుకుంటూ ఉంటారు. సీతారామలక్ష్మణులు వనవాసకాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించి, స్వామివారిని అర్చించినట్టు స్థలపురాణం చెబుతోంది.
పరమపవిత్రమైన ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి తెలుసుకున్న కాకతీయ ప్రభువులు, ఆలయ పునరుద్ధరణకు తమవంతు కృషి చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. కాకతీయుల శివభక్తికీ ... వారి విశాలమైన మనసుకి ఈ ఆలయ నిర్మాణం అద్దం పడుతుంటుంది. అందమైన గోపురాలు ...ఆకట్టుకునే ప్రాకారాలు ... మనసుదోచే మంటపాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. ఇదే ప్రాంగణంలో భారీ ఆకారంలో వీరభద్రుడు ప్రత్యేక మందిరంలో ఆశీనుడై కనిపిస్తాడు.
ఆ పక్కనే 'గండాదీపం' ప్రత్యేకమైన స్థానంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ గండాదీప దర్శనం వలన .. ఎదురుకానున్న గండాలు పక్కకి తప్పుకుని పోతాయని స్థానికులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ఎవరైనా మృత్యువుతో పోరాడుతుంటే, వారితో ఇక్కడి గండాదీప దర్శనం చేయిస్తానని కుటుంబసభ్యులు మొక్కుకుంటే వెంటనే వారు ఆ ప్రాణాపాయం నుంచి బయటపడతారని అంటారు.
అందుకు నిదర్శనాలు ఇక్కడ మొక్కులు చెల్లించుకునే వారు అనేకమంది కనిపిస్తుంటారు. శివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ఈ క్షేత్రాన్ని మహాశివరాత్రి సమయంలో అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆదిదంపతుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు.