ఏ అభిషేకం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?
ఆదిదేవుడు అభిషేకప్రియుడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయనని అభిషేకించడం వలన దోషం ... దుఃఖం ... దారిద్ర్యం నశిస్తాయని చెప్పబడుతోంది. సాధారణంగా శివుడిని నీటితో గానీ ... పాలతోగాని అభిషేకిస్తుంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది.
శంకరుడికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాలను నీళ్లలో వేసి ఆ నీటితో అభిషేకం చేయడం వలన సిరిసంపదలు లభిస్తాయి. సాక్షాత్తు శివుడి కన్నీటి బిందువుల నుంచి ఉద్భవించినట్టుగా చెప్పబడుతోన్న రుద్రాక్షలను నీళ్లలో వేసి ఆ నీళ్లతో అభిషేకం జరపడం వలన దారిద్ర్యం వలన పడుతోన్న బాధలు దూరమవుతాయి. ఇక విభూతి కలిపిన నీటితో శివయ్యకి అభిషేకం చేయడం వలన జన్మజన్మల పాపాలు కొట్టుకుపోతాయి.
తేనెతో చేసే అభిషేకం వలన తేజస్సు ... నెయ్యితో చేసే అభిషేకం సంపదలు ... పెరుగుతో చేసే అభిషేకం కీర్తి ప్రతిష్ఠలను కలిగిస్తాయి. పసుపునీళ్లతో అభిషేకం చేయడం వలన సుదీర్ఘమైనటు వంటి వ్యాధుల బారి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ నేపథ్యంలో 'ధారాభిషేకం' .. 'ఆవృత్త్వాభిషేకం' .. 'రుద్రాభిషేకం' .. 'శతరుద్రాభిషేకం' .. 'ఏకాదశ రుద్రాభిషేకం' .. 'లఘు రుద్రాభిషేకం' .. 'మహారుద్రాభిషేకం' .. 'అతిరుద్రాభిషేకం' అనే ఎనిమిది రకాల అభిషేకాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.
మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ... ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. అంతే కాకుండా, మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.