కనకదుర్గ నడయాడిన పుణ్యస్థలి
దుర్గాదేవి అనే పేరు వినగానే అనేకమైన శక్తులు కలగలిసిన అమ్మవారి ఏకరూపం కనులముందు కదలాడుతుంది. ఆ తల్లి ఆవిర్భవించిన క్షేత్రాలు కూడా శక్తి క్షేత్రాలుగా అలరారుతున్నాయి. లోకంలోని దుర్మార్గత్వాన్ని అణచివేయడానికి అవతరించిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో తన విశిష్టతను చాటుకుంటూ భక్తులను అనుగ్తహిస్తోంది. అలా వెలసిన అమ్మవారి క్షేత్రం అనగానే అందరికీ విజయవాడలోని 'ఇంద్రకీలాద్రి' గుర్తుకు వస్తుంది.,br>
ఇక్కడే కాకుండా 'మొగల్రాజాపురం' కొండపై కూడా అమ్మవారు కొలువై, తనని విశ్వసించిన భక్తులకు విరివిగా వరాలను ఇస్తూ ఉంటుంది. తిరుమల వేంకటేశుడు ... సింహాద్రి అప్పన్న ఇంకా కొన్ని క్షేత్రాల్లోని దైవాలు ముందుగా మరో క్షేత్రంలో ఆవిర్భవించాలనుకుని ... ఆ తరువాత ప్రస్తుతం ఉంటున్న క్షేత్రాల్లో అవతరించినట్టుగా కొన్ని కథనాలు వినిపిస్తూ ఉంటాయి. అమ్మవారు వెలసిన మొగల్రాజాపురం క్షేత్రంలోను ఇలాంటి కథనమే స్థలపురాణంగా వినిపిస్తూ ఉంటుంది.
కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రికి చేరుకోవడానికి ముందుగా ఇక్కడి కొండను ఆవాసంగా చేసుకోవాలని అనుకుందట. ఇక్కడి కొండకు చేరుకొని గుహ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుందట. ఆ తరువాత ఇంద్రకీలాద్రి మరింత అనువుగా కనిపించడంతో మనసు మార్చుకుందని చెబుతారు. అందుకు నిదర్శనంగా మొగల్రాజాపురం కొండగుహలో వెలసిన దుర్గాదేవి దర్శనమిస్తుంది.
అయితే ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి విస్తృత స్థాయిలో తెలియకపోవడం వలన ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అంకిత భావంతో అడగాలేగాని ఈ అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రతి శుక్రవారం ... నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ... పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఆ చల్లని తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు తమపై ప్రసరించాలని ప్రార్ధిస్తుంటారు