అసలైన సంపద అనుగ్రహించేదేమిటి ?
భగవంతుడికి సమీపంగా వెళ్లడానికి ... ఆయనని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. భగవంతుడిని అనునిత్యం సేవించే వాళ్లు చాలామందే కనిపిస్తున్నప్పటికీ, వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటారు. తమకి .. తమ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు లభించాలనే కోరికే ఇందులో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది.
అయితే నిజమైన భక్తులు తమ గురించిగానీ ... తమ భార్యాపిల్లల గురించిగాని దేవుడికి ఏకరువు పెట్టుకోరు. భగవంతుడిని నిరంతరం ధ్యానిస్తూ ... దర్శిస్తూ తాముపొందే సంతోషానికన్నా, మరే సిరిసంపదలు తమకి ఎక్కువకాదని వారు భావిస్తుంటారు. భగవంతుడి సేవ తప్ప మరేది తమకి ఆనందాన్ని కలిగించలేదని అంటారు. అలాంటి వారిలో పోతన ... అన్నమయ్య ... తుకారామ్ ... పురందరదాసు వంటి వారు కనిపిస్తారు.
పోతన ... అన్నమయ్య వంటివారు ఎన్ని కష్టాలనైనా భరించారే గాని దైవ సన్నిధికి దూరమై రాజుల ఆశ్రయాన్ని మాత్రం పొందలేదు. ఇక పూట గడవడం కష్టంగా ఉన్నా, శివాజీ మహారాజు పంపించిన ఖరీదైన కానుకలను తుకారామ్ సున్నితంగా నిరాకరించాడు. అదే కోవలో మనకి పురందరదాసు కూడా కనిపిస్తాడు. అయితే పురందరదాసు స్వతహాగా మంచి ఆస్తిపరుడు. ఒకానొక సంఘటన కారణంగా భగవంతుడి యొక్క తత్త్వం ఆయనకి బోధపడుతుంది. దాంతో ఆయన తన సంపదలను పేదలకి పంచి, పూర్తిగా భగవంతుడి సేవకే సమయాన్ని కేటాయిస్తాడు.
అలాంటి పురందరదాసు ఆ తరువాత ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కోసాగాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు ఆయనని సగౌరవంగా ఆహ్వానించి ఖరీదైన కానుకలను సమర్పిస్తాడు. అక్కడి నుంచి బయటికి రాగానే ఆ సంపదలను పేదలకి పంచేశాడు పురందరదాసు. దాంతో మళ్లీ ఆయనకి కృష్ణదేవరాయలు కానుకల రూపంలో సాయాన్ని అందించబోగా, ఆధ్యాత్మిక సంపదే శాశ్వతమనీ ... అదే ముక్తిని ప్రసాదిస్తుందని కీర్తన రూపంలో తెలియజేస్తాడు పురందరదాసు. మనోహరమైన ఆ కీర్తన ... పాండురంగస్వామిపై ఆయనకి గల భక్తి శ్రద్ధలు కృష్ణదేవరాయలను ఆశ్చర్యచకితుడిని చేస్తాయి ... ఆలోచింపజేస్తాయి.