భక్తుడి ఇంటికి అతిథిగా వచ్చిన ఆదిదేవుడు !
భగవంతుడనేవాడు భక్తుల కష్టనష్టాలను అనుక్షణం పరిశీలిస్తూ ఉండటమే కాదు, అప్పుడప్పుడు ఆ భక్తులను పరీక్షించడం కూడా చేస్తుంటాడు. అది దైవపరీక్ష అని ఎంత మాత్రం తెలియని భక్తులు, ఆ పరీక్షలో నెగ్గితే ఇహ పరాల్లో వారి సౌఖ్యానికి ఎలాంటి లోటూ ఉండదు. అనేకమంది భక్తుల జీవిత చరిత్రలు ఇందుకు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తూ ఉంటాయి.
శివ భక్తులలో ముందువరుసలో కనిపించే మంజునాథుడు కూడా, ఇలాంటి కష్టతరమైన పరీక్షను ఎదుర్కుని మహాదేవుడి మనసు గెలుచుకున్నాడు. సదాశివుడి భక్తుడైన మంజునాథుడు ఏ రోజూ కూడా అతిథికి భోజనం పెట్టకుండా తాను భోజనం చేసేవాడు కాదు. అలాంటి మంజునాథుడికి ఒకరోజున అతిథి అనేవాడు దొరక్కుండా చేసి, తాను అతిథిగా మారువేషంలో అతని ఇంటికి వెళతాడు ఈశ్వరుడు. ఆప్యాయంగా అతిథిని ఆహ్వానించి అతనికి దగ్గరుండి భోజనం వడ్డిస్తాడు మంజునాథుడు.
భోజనం కలుపుతూ .. కావాలనే మంజునాథుడి దగ్గర అతను శివుడి గురించి ప్రస్తావిస్తాడు. సృష్టిలోని ప్రతి జీవికి ఆదిదేవుడి అనుగ్రహం కావలసినదేననీ, ఆయనలో ఐక్యమైనప్పుడే జన్మకు సార్థకత లభించినట్టు అవుతుందని అంటాడు మంజునాథుడు. ఆ మాటలను అతిథి వేషంలో వచ్చిన శివుడు కొట్టిపారేస్తాడు. శివుడి రూపాన్ని ... ఆయన గుణగణాలను గురించి హేళనగా మాట్లాడతాడు.
శివ నిందను సహించని మంజునాథుడు అతిథి ధోరణిపట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆదిదేవుడిని అవమానపరుస్తూ మాట్లాడినవారికి తన ఇంట స్థానం లేదంటూ అతిథిని బయటికి గెంటేస్తాడు. అయితే ఆదిదేవుడు దానిని అవమానంగా భావించడు. ఆవేశంతో అతను తనని బయటికి నెట్టేయడం బాధించదు. పరమశివుడి పట్ల మంజునాథుడికి గల ప్రేమాభిమానాలు చూసి ముక్కంటి మురిసిపోతాడు. మంజునాథుడికి మోక్షాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకుని ఆ స్వామి కైలాసానికి బయలుదేరుతాడు.