మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ప్రత్యేకత
సోమనాథం ... శ్రీ శైలం ... మహాకాళం ... ఓంకారేశ్వరం ... కేదారేశ్వరం ... భీమశంకరం ... విశ్వేశ్వరం ... త్రయంబకం ... వైద్యనాథం ... నాగేశ్వరం ... రామేశ్వరం ... ఘశ్మేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో పరమశివుడు ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని విశ్వసిస్తారు. ఈ కారణంగానే ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైనవిగా ... మహిమాన్వితమైనవిగా చెబుతుంటారు.
పరమశివుడి ప్రత్యక్ష రూపాలుగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాల్లో దేనికదే విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అయితే అన్నింటిలోకి ఉజ్జయినీలో గల మహాకాళేశ్వర క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సదాశివుడుకి స్మశానంలోని బూడిదతో అభిషేకం చేస్తారు. లోక కంటకుడైన దూషణాసురుడుని సంహరించిన అనంతరం మహాదేవుడు ఇక్కడ మహాకాళేశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన అపమృత్యు భయం తొలగిపోతుందని చెప్పబడుతోంది.
దక్షిణ ముఖంగా ఉన్న ఇక్కడి స్వామి తాంత్రిక స్వరూపుడిగా చెబుతారు. ఈ కారణంగానే ప్రతి రోజు తెలతెలవారుతుండగానే, ఒక సాధువు దగ్గరలోని స్మశానం నుంచి బూడిద తీసుకువస్తాడు. మహాకాళేశ్వరుడికి ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న స్మశాన భస్మాన్ని ఒక వస్త్రంలో పోసి, దాని ద్వారా స్వామిని అభిషేకిస్తారు. ఈ రకమైన అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇక్కడ ఒక్కచోటున మాత్రమే జరుగుతుంది.
ఇక్కడి ఆలయం మూడు అంతస్తులుగా నిర్మించబడింది. మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు ... రెండవ అంతస్తులో ఓంకారేశ్వరుడు ... మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వరుడు కొలువై ఉంటారు. నాగచంద్రేశ్వరుడుని ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే 'నాగపంచమి' రోజున మాత్రమే దర్శించుకునే అవకాశం ఉండటం ఇక్కడి విశేషం.