భక్తుడి వైపు తిరిగిన గర్భాలయ దేవుడు
ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా అక్కడ వేల సంఖ్యలో భక్తులు కనిపిస్తూ ఉంటారు. అంతమందిలో వరుసలో నుంచుని దైవదర్శనానికి నిరీక్షించవలసి వస్తుంది. తీరా గర్భాలయంలోని దైవం ముందుకు వచ్చే సరికి వెనక నుంచి నెడుతూనే ఉంటారు. దాంతో స్వామిని కళ్లారా చూసుకోలేక పోయామేననే బాధ కలుగుతుంటుంది.
నిజమైన భక్తులు స్వామిని చూడటానికి తొందరపడుతూ ముందువారిని నెట్టివేయడం వంటివి చేయరు. తాను దేవుడిని చూడటం కన్నా ... జన ప్రవాహంలో వున్న తనని దేవుడు చూస్తే చాలని అనుకుంటారు. అలాంటి భక్తులు తన దర్శనం లభించక ఇబ్బంది పడుతుంటే, తనకై తానుగా వారికి భగవంతుడు సాక్షాత్కరించిన సంఘటనలు ఎన్నో కనిపిస్తుంటాయి. అలాంటి మహిమాన్వితమైన సంఘటనలకు నెలవుగా మారిన పుణ్యక్షేత్రాలలో 'శ్రీకూర్మం' ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.
శ్రీకాకుళం జిల్లాలోగల ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి 'తాబేలురూపం'లో దర్శనమిస్తూ కూర్మనాథస్వామిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. పూర్వం భిల్లజాతికి చెందిన ఓ యువకుడు స్వామివారిని గురించి తెలుసుకుని, ఆయనపై ప్రేమానురాగాలను పెంచుకుంటాడు. ఆయనని చూడాలనే ఉద్దేశంతో ఆలయానికి వస్తాడు. ఆలయ ప్రవేశానికి అతను అనర్హుడంటూ అక్కడి వారు ఆయనని అడ్డుకుంటారు. దాంతో అతను గర్భగుడి వెనకకి వెళ్లి అక్కడి గోడకు తల కొట్టుకుంటూ ఏడవడం మొదలుపెడతాడు.
అతని భక్తినీ ... తనని చూడటానికి అతను పడుతోన్న తపనని కూర్మనాథస్వామి అర్థం చేసుకుంటాడు. గర్భాలయంలో తూర్పు ముఖంగా ఉన్న స్వామివారి ప్రతిమ, భిల్లుడు వున్న పశ్చిమ ముఖానికి తిరుగుతుంది. అది చూసిన అర్చకులు ... ఇతర భక్తులు ఆశ్చర్యపోతారు. అందుకు కారణమేమిటా అనుకుంటూ ఆలయం వెనుక వైపుకి వెళ్లగా, తలకి తీవ్రమైన గాయాలతో భిల్లుడు కనిపిస్తాడు.
ఆలయ సిబ్బంది తమ తప్పు తెలుసుకుని భిల్లుడికి ఆలయ ప్రవేశం కల్పించి స్వామి దర్శనం చేయిస్తారు. అయితే తన భక్తులు ఎటువైపు వుంటే తన దృష్టి అటువైపు ఉంటుందనడానికి నిదర్శనంగా కూర్మనాథస్వామి ప్రతిమ మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ కారణంగానే ఈ ఆలయానికి ముందు వైపునే కాకుండా వెనుక వైపున కూడా ధ్వజ స్తంభం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఎందరో మహనీయులు దర్శించి తరించారు.