మదనద్వాదశి వ్రతం
ఉన్నతమైనటువంటి జన్మలను ఆశించి చేసే వ్రతాలలో 'మదనద్వాదశి వ్రతం' ముఖ్యమైనది. ఈ వ్రతమును 'ఆశ్వీయుజ శుక్ల ఏకాదశి' మొదలు ... 'కార్తీక శుద్ధ ఏకాదశి' వరకూ చేయవలసి వుంటుంది. ప్రతిరోజు తులసికోట దగ్గర పంచ పద్మాలను గీసి ... పంచ దీపాలను వెలిగించి తులసీ సహిత విష్ణుమూర్తిని పూజించాలి.
కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం .. జాగరణ చేసి, ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానమాచరించి బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. ఒక ముద్దను తులసికీ ... రెండో ముద్దను బ్రాహ్మణుడికి ఇచ్చి, మూడో ముద్దను రోటిలో వేసి పాలుపోసి చెరుకు గడతో దంచాలి. అలా దంచినప్పుడు పాలు చిలికి శరీరంపై ఎన్ని బిందువులు పడతాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక ఈ వ్రత మహిమ గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ... లక్ష్మీదేవితో చెప్పినట్టుగా తెలుస్తోంది. విధవరాలైన ఓ బ్రాహ్మణ స్త్రీ తల్లిదండ్రులను కోల్పోయింది. ఒంటరిగా ఉంటున్నప్పటికీ ఆమె ఎవరినీ ఆదరించేది కాదు ... ఎలాంటి దానధర్మాలు చేసేది కాదు. ఎవరు బిక్షకి వచ్చినా ''నాస్తి నారాయణ'' అంటూ వుండేది. లేదని చెబుతూనే తన పేరు ఉచ్చరిస్తూ పుణ్యం మూటగట్టుకుంటోన్న ఆమె తీరు నారాయణుడికే ఆశ్చర్యాన్ని కలిగించింది.
దాంతో ఆయనే బ్రాహ్మణుడి వేషంలో ఆమె ఇంటికి బిక్షకి వెళ్లాడు. ఆ సమయంలో ఇల్లు అలుకుతున్న ఆమె అలవాటు ప్రకారం ''నాస్తి నారాయణ'' అనేసింది. దాంతో మారు వేషంలో వున్న విష్ణుమూర్తి ... ఆకలివేళ అతిధిని ఉత్తచేతులతో పంపించడం మంచిది కాదని చెప్పాడు. ఆ మాటకి ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇల్లు అలుకుతున్న గుడ్డను, బిక్షాపాత్రలో పడేట్టుగా విసిరేసింది. అందులో ఓ కందిగింజ కనిపించడంతో, దానిని అక్కడే నాటి వెళ్లిపోయాడు నారాయణుడు.
కాలక్రమంలో ఆమె చనిపోయి కందిగింజ నాటబడిన చోటున వేరు పురుగుగా జన్మించింది. వేరుపురుగు అవస్థ చూసిన లక్ష్మీదేవి, ఆ పురుగు తిరిగి ఉత్తమైన జన్మ ఎత్తాలంటే ఏంచేయాలంటూ అడిగింది. 'మదన ద్వాదశి' వ్రతం చేసి అందులో కొంచెం పుణ్యం ఆ పురుగుకి ఇవ్వాల్సి ఉంటుందని నారాయణుడు సమాధాన మిచ్చాడు. లక్ష్మీదేవి ఆ వ్రతాన్ని ఆచరించి ఆ పురుగుకు తిరిగి మానవ రూపం తీసుకువచ్చింది. అంతట ఆ స్త్రీ ... లక్ష్మీ నారాయణులకు కృతజ్ఞతలు తెలియజేసి, ఆ తరువాత ఈ వ్రతాన్ని తాను ఆచరిస్తూ వచ్చింది.