ఒకే సమయంలో అనేక చోట్లకి వెళ్లిన బాబా
మశీదులో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూనే అనేకమంది భక్తుల హృదయాలను బాబా గెలుచుకుంటాడు. బాబాతో బాగా చనువుగా వుండే అతి కొద్దిమంది మాత్రమే ఆయనకి ఇష్టమైన తీసుకువచ్చి పెట్టేవాళ్లు. మిగతా వాళ్లు ఆ భాగ్యం తమకి ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూసే వాళ్లు. అలాంటి భక్తులకు ఒక మంచి అవకాశం లభిస్తుంది.
ఓ రోజున బాబా దగ్గరికి కొంతమంది భక్తులు వచ్చి, మరునాడు పండుగ అనే విషయాన్ని ఆయనకి గుర్తుచేస్తారు. ఆ రోజున భోజనానికి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని కోరతారు. ఒకే రోజున అందరి ఇళ్లకు భోజనానికి రావడం ఎలా కుదురుతుందని బాబా అడగడంతో, వాళ్లలో వాళ్లు పోటీలుపడుతూ గొడవపడసాగారు.
దాంతో బాబా ఒక్కొక్కరిని పిలిచి పండగకి అతని ఇంట్లోనే భోజనం చేస్తాననీ, అనవసరంగా ఇతరులతో వాదించవద్దని చెప్పి పంపించివేస్తాడు. ఇదంతా గమనిస్తోన్న బాబా సన్నిహితులు, ఆయన ఎవరి ఇంటికి వెళతాడో చూడాలని అనుకుంటారు. కానీ పండుగ రోజున బాబా మశీదులోనే తన సహచరుల మధ్య గడుపుతాడు. బాబా ఎక్కడికీ వెళ్లకపోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
పండుగ మరునాడు మశీదు దగ్గరికి వచ్చిన ఆ భక్తులు బాబా తమ ఇంటికి వచ్చాడంటే ... తమ ఇంటికి వచ్చాడని వాదించుకోసాగారు. అది గమనించిన బాబా సన్నిహితులు, అసలు ఆ రోజున బాబా ఎక్కడికీ వెళ్లలేదనీ ... మశీదులోనే ఉన్నాడని చెప్పడంతో నివ్వెరపోతారు. ఇదంతా గమనిస్తోన్న మిగతా భక్తులు అయోమయానికి లోనవుతారు. ఎవరు చెబుతున్నది నిజమో తెలుపమంటూ బాబాను కోరతారు.
తమ ఇంటికి వచ్చినట్టుగా ఆ భక్తులందరూ చెబుతున్నదీ నిజమేననీ, అలాగే మశీదులోనే ఉన్నానంటూ తన సన్నిహితులు చెబుతున్నది కూడా నిజమేనని అంటాడు బాబా. తన భక్తులందరినీ సంతృప్తి పరచడం కోసం బాబా అలా మహిమను చూపాడనే విషయం వాళ్లకి అర్థమవుతుంది. దాంతో అందరూ కూడా ఆనందాశ్చర్యాలకి లోనవుతూ బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తారు.