సంతానాన్ని అనుగ్రహించే సదాశివ క్షేత్రం
ఒకవైపున పురాణ ప్రాశస్త్యం ... మరో వైపున చారిత్రక నేపథ్యం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా విలసిల్లుతూ వుంటాయి. అలాంటి పుణ్యక్షేత్రాల జాబితాలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల సమీపంలో గల 'రామలింగేశ్వర ఆలయం' దర్శనమిస్తుంది. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా కనిపించే ఈ ప్రశాంతమైన ప్రదేశంలో ఎత్తైన కొండల మధ్య నుంచి 'మానేరు' ప్రవహిస్తూ వుంటుంది.
పూర్వం మాండవ్య మహర్షి ఈ యేటి ఒడ్డున తపస్సు చేసుకున్న కారణంగా దీనికి మానేరు అనే పేరు వచ్చింది. మాండవ్య మహర్షి అభ్యర్థన మేరకే శివుడు లింగరూపంలోను ... పార్వతీదేవి విగ్రహ రూపంలోను ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థల పురాణం చెబుతోంది. అలాంటి శివపార్వతులను ... సీతారాములు పూజించారని అంటారు. వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన సీతారాములు, ఇక్కడి శివపార్వతులను ఆరాధించి అనుగ్రహాన్ని పొందినట్టు తెలుస్తోంది.
ఇంతటి పౌరాణిక నేపథ్యం కలిగిన ఈ క్షేత్రంలో ఆదిదంపతులకు ఆలయాన్ని నిర్మించినది ఎవరో కాదు ... మహా శిల్పి 'రామప్ప' అని చెబుతుంటారు. వరంగల్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటు వంటి రామప్ప గుడిని దర్శించినవారికి, రామప్ప శిల్పకళా నైపుణ్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన నిర్మించిన కారణంగానే ఈ ఆలయాన్ని 'రామప్ప గుడి' గా పిలుచుకుంటూ వుంటారు.
ఇక్కడి స్వామిని పూజించడం వలన సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనే బలమైన విశ్వాసం వుంది. భక్తుల అనుభవాలు ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తూ వుంటాయి. ప్రతి ఏడాది కూడా మాఘమాసంలోని అమావాస్య రోజుని పురస్కరించుకుని ఇక్కడ ఘనంగా జాతర నిర్వహిస్తూ వుంటారు. ఇక్కడి శివుడంటే ఈ గ్రామస్తులకే కాదు ... చుట్టుపక్కల వారికి సైతం ఎంతో ఇష్టం ... మరెంతో నమ్మకం. ఈ కారణంగానే ఆయనకి జరిగే కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఆదిదంపతులకు కానుకలు ... మొక్కుబడులు సమర్పించుకుని వారి ఆశీస్సులు అందుకుంటారు.