కాటువేయ వచ్చిన కాలసర్పం కరుణిస్తుందా ?
ఏకనాథుడు బాల్యం నుంచే భక్తి భావాలను కలిగి అక్కడివారిని ఆశ్చర్యచకితులను చేశాడు. తన తోటి పిల్లలు వయసుకి తగిన అల్లరి ఆటలు ఆడుతూ వుంటే, ఏకనాథుడు మాత్రం రాళ్లను విగ్రహాలుగా నిలిపి వాటి ఎదురుగా భజనలు చేస్తున్నట్టుగా ఆడేవాడు. ఏ మాత్రం సమయం దొరికినా గుడికి వెళ్లి దైవ సన్నిధిలోనే ఉండిపోయేవాడు. కాలంతో పాటు ఆయనలోని భక్తి శ్రద్ధలు పెరిగిపోయాయి.
యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయన జనార్ధనుడిని గురువుగా చేసుకుని ఆయన సేవలు చేస్తూ విద్యను అభ్యసించసాగాడు. ఏకనాథుడి వినయ విధేయతలు ... భక్తి శ్రద్ధలు అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చుట్టుపక్కల గ్రామాలవారు ఏకనాథుడు ధ్యానం చేసుకునే ప్రదేశానికి వచ్చి దర్శించుకునే వారు. పాండురంగస్వామిని గురించి ధ్యానం చేసేటప్పుడు ఆయనలో కనిపించే దివ్యమైన తేజస్సును చూస్తూ పరవశించిపోయేవారు.
అలాంటి పరిస్థితుల్లో ఒకరోజున ఏకనాథుడు ధ్యానంలో వుండగా, అందరూ చూస్తుండగానే ఓ కాలసర్పం ఆయన వైపు వేగంగా రాసాగింది. దానిని అడ్డుకునే సమయం లేకపోవడంతో అంతా ఆందోళనతో చూడసాగారు. ఆ కాలసర్పం ఏకనాథుడి ఒడిలో నుంచి నడుముని చుట్టుకుంటూ వీపు మీదుగా భుజాల పైకి చేరి ఆయన తలపై పడగవిప్పి ఆడసాగింది. ఈ దృశ్యం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఏకనాథుడు మరి కాసేపట్లో ధ్యానం నుంచి బయటికి వస్తాడనగా, ఆ సర్పం చరచరపాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన ఏకనాథుడికి అక్కడి వాళ్లు జరిగింది చెప్పారు. నిజానికి ఆ సర్పం కాటు వేయడానికే వచ్చిందనీ, అయితే తనని తాకగానే అది తన సహజమైన గుణాన్ని మరిచిపోయిందని అంటాడు. అందుకు కారణం పాండురంగడనీ, ఆయన భక్తులకు మరణం కూడా మచ్చిక అవుతుందని చెబుతాడు. తన ద్వారా స్వామి సన్నిధిలోని చల్లదనాన్ని పొందిన ఆ సర్పం ప్రతిరోజూ వచ్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని అంటాడు.
ఏకనాథుడు చెప్పినట్టుగానే ఆ సర్పం ప్రతి రోజూ వచ్చి ఆయన తలపై పడగవిప్పి ఆడుతూ వుండేది. పాండురంగస్వామిని ధ్యానిస్తూ పరమశివుడిలా కనిపించే ఆయనని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే వాళ్లు. తమ ఇంటి దగ్గర కూడా ఏకనాథుడిని పూజిస్తూ వుండేవాళ్లు.