కొండదిగి వచ్చిన హనుమంతుడు
త్రిపురాసుర సంహార సమయంలో తనకి శ్రీమహావిష్ణువు సహకరించినందుకు కృతజ్ఞతగా హనుమంతుడిగా అవతరించిన శివుడు, రావణ సంహారానికిగాను శ్రీరాముడికి సహకరిస్తాడు. అలా శివాంశతో అవతరించిన హనుమంతుడు ... సూర్యుడి దగ్గర విద్యను అభ్యసిస్తాడు. వాయుదేవుడి కుమారుడిగా సమస్తదేవతల ఆశీస్సులు అందుకుంటాడు. అలాంటి హనుమంతుడిని పూజిస్తే ఆయన కరుణతో పాటుగా శ్రీరాముడి కటాక్షం కూడా దక్కుతుంది.
ఈ కారణంగానే ప్రతి ఊళ్లోనూ రామాలయ ప్రాంగణంలో గానీ, ప్రత్యేకంగా గాని హనుమంతుడి ఆలయాలు కనిపిస్తూ వుంటాయి. అలాంటి వాటిలో విశిష్టమైన ఆలయం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని 'బాదలాపురం' లో కనిపిస్తుంది. సాధారణంగా హనుమంతుడు అనే పేరు వినిపించనంత దూరంలో శనిదేవుడు ఉంటాడు. హనుమంతుడు కనిపించనంత దూరంలో దుష్టశక్తులు వుంటాయి. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు ఆయా గ్రామాల ప్రవేశ ద్వారం చెంతనే కనిపిస్తూవుంటాయి.
బాదలాపురంలోని హనుమంతుడు కూడా గ్రామ రక్షకుడిగా ఊరు మొదట్లోనే దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడి హనుమంతుడు మహిమాన్వితుడని గ్రామస్తులు చెబుతుంటారు. చాలాకాలం క్రితం ఈ గ్రామానికి చెందిన ఓ భక్తుడు, ఇక్కడ హనుమంతుడికి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడట. సూర్యాపేట మండలానికి చెందిన 'దురాజ్ పల్లి' గుట్టపైన గల ఒక బండరాయిని ఎంచుకుని హనుమంతుడి విగ్రహాన్ని చెక్కిస్తాడు.
శిలపై స్వామివారి రూపాన్ని మలచడం పూర్తి కావడంతో, దానిని తీసుకు వెళ్లడానికి గ్రామస్తులు కొందరు వస్తారు. కానీ కొండ భాగంలో వున్న ఆ విగ్రహాన్ని కిందికి దింపి ట్రాక్టర్లో ఉంచడానికి వాళ్లు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోతుంది. ఇక తమ వలన కాదనీ ... దయచేసి తమతో రమ్మని వాళ్లు స్వామివారిని ప్రాధేయపడతారు. అంతే అంతా చూస్తుండగానే ఆ విగ్రహం పై నుంచి జారుతూ వచ్చి ట్రాక్టర్ తొట్లోకి చేరింది.
ఊహించని ఈ సంఘటనకి వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఆనందోత్సాహాలతో స్వామివారిని తీసుకుని వచ్చి ప్రతిష్ఠిస్తారు. ఆ రోజు నుంచి స్వామివారికి నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వామివారు అడిగినవారికి లేదనకుండా అనుగ్రహిస్తాడని చెప్పుకుంటారు. ప్రతియేటా హనుమజ్జయంతి వేడుకను ఘనంగా జరుపుతుంటారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటూ వుంటారు.