కదిరి స్వామిపై కనిపించే స్వేదబిందువులు
భగవంతుడు తన భక్తులను రక్షిస్తూ ఉంటాడనీ ... వాళ్లని బాధించే దుష్టులను శిక్షిస్తూ ఉంటాడని లోకానికి నిరూపించడానికి శ్రీమహావిష్ణువు ... నరసింహస్వామిగా అవతరిస్తాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం, అతికష్టం మీద ఆయనని ప్రహ్లాదుడు శాంతింప జేస్తాడు. ప్రహ్లాదుడి కోరికపై భక్తులను అనుగ్రహించడం కోసం స్వామి అనేక ప్రాంతాల్లో ఆవిర్భవిస్తాడు.
అయితే చాలా క్షేత్రాల్లో అమ్మవారిని ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని స్వామివారు ప్రశాంత వదనంతో దర్శనమిస్తూ వుంటాడు. అందుకు భిన్నంగా ... మరెక్కడా లేని విధంగా హిరణ్యకశిపుడిని సంహరిస్తూ స్వామి దర్శనమిచ్చే విశిష్టమైన క్షేత్రంగా 'కదిరి' కనిపిస్తుంది. అనంతపురం జిల్లాకి చెందిన ఈ క్షేత్రం అత్యంత శక్తిమంతమైనదిగా ... మహిమాన్వితమైనదిగా ప్రెసిద్ధి చెందింది.
ఇక్కడి గర్భాలయంలో నరసింహస్వామివారి మూలమూర్తి ఉగ్రత్వాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది. హిరణ్య కశిపుడు పెనుగులాడకుండా రెండు చేతులతో స్వామి అదిమిపట్టి, మరో రెండు చేతులతో అతని కడుపుని చీల్చుతూ దర్శనమిస్తుంటాడు. భక్తులందరూ కూడా ఈ సంఘటన తమ కళ్ల ముంగిట ప్రత్యక్షంగా జరుగుతూ వుందేమోననే అనుభవానికి లోనవుతూ వుంటారు.
ఉగ్ర నరసింహస్వామి వారికి అనునిత్యం అభిషేకం చేస్తుంటారు. స్నానం చేయించిన తరువాత స్వామివారి శరీరంపై గల తడిని మెత్తటి వస్త్రంతో తుడిచేస్తారు. అప్పుడు స్వామివారి శరీరంపై ఒక అరగంటసేపు 'స్వేద బిందువులు' కనిపిస్తాయని అర్చకులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువుదీరి ఉండటం వల్లనే ఇలా జరుగుతోందని అంటారు. మహిమాన్వితమైనటువంటి ఈ విషయాన్ని గురించి భక్తులు ఎంతో ఆసక్తికరంగా చెప్పుకుంటూ వుంటారు. అనుదినం ఆ స్వామిని పూజిస్తూ పునీతులవుతుంటారు.