శ్రీరాముడిచే పూజలందుకున్న శివ క్షేత్రం
కాకతీయ ప్రభువులు తమ పరిపాలనా కాలంలో ఎన్నో శైవ క్షేత్రాలను నిర్మించారు. మరెన్నో ఆలయాలను అభివృద్ధి పరిచారు. తమ తరువాత కాలంలో కూడా ఆ దేవాలయాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఆనాటి శాసనాలు ఆవిష్కరిస్తూ వుంటాయి. అలా కాకతీయుల కాలంలో రామలింగేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికీ ... ఇతర దేవతా మూర్తుల ఆలయాల నిర్మాణానికి నోచుకున్న క్షేత్రం మనకి మెదక్ జిల్లా దుబ్బాక మండలం 'కూడవెల్లి' లో దర్శనమిస్తుంది.
ఇక్కడ ప్రవహిస్తోన్న వాగు సమీపంలో పూర్వం మాండవ్య మహర్షి శివుడిని పూజించాడు. కనుకనే ఈ వాగును మాండవ్య వాగు అని పిలుస్తుంటారు. 'మాండవ్య వాగు' రెండుగా చీలిపోయి ఇక్కడి పవిత్రమైన ప్రదేశంలో కలుస్తుంది. ఈ రెండుపాయలు కూడిన (కలుసుకున్న) ప్రదేశం ప్రదేశం కనుకనే ఈ ప్రదేశానికి కూడవెల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు. రావణ సంహారం అనంతరం ఆ పాపపరిహారార్థం శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతుంది.
రాముడి చేత ప్రతిష్ఠించబడిన కారణంగానే ఇక్కడి స్వామివారు రామలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. మాండవ్య మహర్షిచే పూజించబడిన ఈ శివాలయం జీర్ణస్థితికి చేరుకోవడంతో కాకతీయ ప్రభువులు ఆలయాన్ని పునఃనిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అదే సమయంలో వాళ్లు ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టించారు. నాటి నుంచి ఇది హరిహర క్షేత్రంగా అలరారుతోంది.
హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రంలో, పార్వతీదేవి ... గణపతి ... కుమారస్వామి ... వీరభద్రస్వామికి కాకతీయ ప్రభువులు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. వాగులోని అనేక శిలలను శివలింగాలుగా మార్చిన తీరు ... వాటిని అభిషేకిస్తూ పరుగులుతీసే నీరును చూస్తుంటే ప్రతి మనసు పరవశించిపోతుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలోని అమావాస్యను పురస్కరించుకుని మూడురోజుల పాటు ఇక్కడ ఘనంగా జాతర నిర్వహిస్తారు.
విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, రెండు నీటిపాయలు కలిసేచోట పుణ్యస్నానాలు ఆచరిస్తూ వుంటారు. ఆ తరువాత దైవ దర్శనం చేసుకుని కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఇక్కడి స్వామిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. పురాణ నేపథ్యం ... చారిత్రక వైభవం కలిగిన ఈ క్షేత్రం అడుగడుగునా పవిత్రతను ఆవిష్కరిస్తుంది ... అడగకుండానే అనంతమైన ప్రశాంతతను ప్రసాదిస్తుంది.