సాధువుగా దర్శనమిచ్చిన శ్రీనివాసుడు
మెదక్ జిల్లా సంగారెడ్డిలోని 'వైకుంఠపురం'లో గోదాదేవి సమేత శ్రీ విరాట్ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఇటీవల కాలంలో పునఃనిర్మాణానికి ... నూతన విగ్రహ ప్రతిష్ఠకి నోచుకున్న ఈ ఆలయం వెనుక వందల సంవత్సరాల చరిత్ర వుంది. పూర్వం ఇక్కడ వేంకటేశ్వరస్వామి వారు ఆవిర్భవించిన తీరును పరిశీలిస్తే ఇది ఎంతటి మహిమాన్వితమైన క్షేత్రమనేది అర్థమవుతుంది.
ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట. పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ దివ్యమైన తేజస్సుతో కనిపించే ఆ సాధువు సాధారణ వ్యక్తి కాదని అక్కడి ప్రజలు గమనిస్తారు. ఆయనలో ఏదో మానవాతీత శక్తి వుందని విశ్వసిస్తూ ఆశీస్సులు తీసుకునేవారు. ఒక 'శ్రీ పంచమి' రోజున శ్రీ వేంకటేశ్వరస్వామివారి విగ్రహం ఆ ప్రదేశంలో ఆవిర్భవిస్తుందనీ, ఆ స్వామి అక్కడ నిత్యపూజలు అందుకుంటాడని ఆ సాధువు జరగబోయేది చెబుతాడు.
శ్రీ పంచమి వచ్చినా ఎక్కడా ఎలాంటి సందడి లేకపోవడంతో అక్కడి భక్తులలో అనేకరకాల సందేహాలు తలెత్తుతాయి. స్వామివారి ఆవిర్భావం గురించి అడగడానికి వాళ్లంతా ఆ సాధువు దగ్గరికి వస్తారు. ఆ సమయంలోనే ఆయన స్నానానికని నీటిగుండంలోకి దిగుతుంటాడు. వాళ్లందరినీ చూస్తూ అందులో మునకేసిన సాధువు ఎంతసేపైనా తిరిగి బయటికి రాడు. దాంతో వాళ్లు కంగారుపడిపోయి నీటి గుండంలో గాలించగా వేంకటేశ్వరస్వామి విగ్రహం లభిస్తుంది.
ఆ విగ్రహం సాధువు అంతటి ఎత్తుగా వుండటం ... సాధువు నీటిలో దిగుతున్నప్పుడు ధరించిన వస్త్రం ఆ విగ్రహనికి కట్టబడి వుండటంతో వాళ్లకి విషయం అర్థమవుతుంది. సాధువు రూపంలో వచ్చిన శ్రీనివాసుడి దర్శనభాగ్యం తమకి లభించినందుకు సంతోషంతో పొంగిపోతారు. నీటి గుండంలో నుంచి బయటపడిన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకుని పూజించుకున్నారు. ఇంతటి క్షేత్ర మహాత్మ్యం కలిగిన ఈ ఆలయం నేడు ఆధునిక వైభవాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది.