దేవుడు ఇలా సాయపడతాడు
మాణిక్య ప్రభువుల వారు తన శిష్య బృందంతో కలిసి వివిధ క్షేత్రాలను దర్శిస్తూ వెళుతున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా పండరీపురానికి బయలుదేరారు. ఎప్పుడెప్పుడు ఆ పాండురంగడిని దర్శించుకుందామా ... ఆయన భజన చేస్తూ పరవశిద్దామా అని ప్రభువుల వారితో పాటు శిష్యులంతా ఆరాటపడసాగారు. అయితే చంద్రభాగా నది ఉధృతంగా ప్రవహిస్తూ వుండటం చూసి శిష్యులు డీలాపడిపోతారు.
ప్రవాహ వేగం చూస్తుంటే రెండు మూడు రోజుల వరకూ తగ్గేలా లేదు. అందువలన పడవలు నడిపే వాళ్లు కూడా ఆ దరిదాపుల్లో లేకుండా పోయారనే విషయం వాళ్లకి అర్థమవుతుంది. ప్రవాహం వేగం తగ్గేంత వరకూ ఒడ్డునే కాలక్షేపం చేయక తప్పదనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ రాత్రికి అక్కడ బసచేయక తప్పదని భావించి అందుకు అవసరమైన ఏర్పాట్లను మొదలుపెట్టడం మంచిదనుకుంటారు.
ప్రభువులవారి అనుమతి కోసం ఆయన దగ్గరికి వెళతారు. గట్టుపై కూర్చుని నదీమ తల్లిని ఆప్యాయంగా చూస్తోన్న ప్రభువుల వారు శిష్యుల రాకను గమనించి విషయమేవిటని అడుగుతారు. రెండు మూడు రోజుల వరకూ నదిని దాటే అవకాశం లేదనీ, అందువలన ఒడ్డునే బసకు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్టు చెబుతారు. మనసు నిండా భగవంతుడిపట్ల విశ్వాసాన్ని నింపుకున్న వాళ్లని ప్రవాహాలు ... ఆపదలు ఏమీ చేయలేవని ప్రభువులవారు చెబుతారు. ఇదంతా ఆ పాండురంగస్వామి లీలా విశేషమనీ, మరికాసేపటిలో తాము అవతల ఒడ్డున ఉంటామని అంటారు.
ఆ మాటలకు శిష్యులు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అదే సమయంలో ఓ పడవ వాడు అటుగా వచ్చి అవతల ఒడ్డుకు చేరుస్తానంటూ అందరినీ పిలుస్తాడు. అందరూ ఆ పడవెక్కి కూర్చుంటారు. నది ఉధృతిని తట్టుకుంటూ ఎంతో నైపుణ్యంగా ఆ పడవవాడు అందరినీ అవతల ఒడ్డుకి చేరుస్తాడు.
పడవ దిగిన తరువాత డబ్బులీయబోయిన ప్రభువుల వారి శిష్యులు ఆశ్చర్యపోతారు. అక్కడ పడవే తప్ప పడవవాడు లేడు. అయోమయంగా వాళ్లు ప్రభువుల వారివైపు చూడగా, నవ్వుకుంటూ ఆయన అక్కడినుంచి కదిలారు. జరిగినదంతా ప్రభువుల వారి మాయనో ... పాండురంగడి మహిమనో తేల్చుకోలేక సతమతమవుతూనే శిష్యులంతా అక్కడినుంచి బయలుదేరారు.