భీష్మ ఏకాదశి రోజున ఏం చేయాలి ?
మహాభారత యుద్ధంలో కీలకమైన పాత్రను పోషించిన భీష్ముడి పేరున ఏర్పాటు చేయబడినదే 'భీష్మఏకాదశి'. తాను అనుకున్న రోజున అనుకున్న సమయానికి మరణాన్ని పొందేలా భీష్ముడు వరాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ కారణంగానే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకూ యాభైఆరు రోజులపాటు అంపశయ్యపై వేచి వుండి మాఘ శుద్ధ అష్టమి రోజున చివరిశ్వాస విడిచాడు. ఆనాటి నుంచి ఈ రోజు 'భీష్మాష్టమి'గా ప్రసిద్ధి చెందింది.
ఇక తన పట్ల భీష్ముడికి గల భక్తి విశ్వాసాలను గ్రహించిన శ్రీకృష్ణుడు, ఆయనపై గల అభిమానంతో ఈ ఏకాదశికి 'భీష్మ ఏకాదశి' గా నామకరణం చేశాడు. ఈ రోజున తనని పూజించిన వారికి ... ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి విశేష పుణ్యఫలాలు లభిస్తాయని సెలవిచ్చాడు. ఆనాటి నుంచి మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకోవడం ఆరంభమైంది.
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ... నూతన వస్త్రాలను ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించాలి. రోజంతా ఉపవాసం ఉంటూ జాగరణ చేయాలి. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వివిధ రకాల పాపాల నుంచి ... శాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా పురాణాల్లో మనకి అనేక సంఘటనలు కనిపిస్తుంటాయి.