వటసావిత్రి వ్రతం

స్త్రీలు ఎన్ని నోములు ... వ్రతాలు చేసినా ... తమ సంతానాన్ని ... సౌభాగ్యాన్ని చల్లగా చూడమని కోరడమే వాటి ప్రధాన ఉద్దేశం. అలా తమ సౌభాగ్యాన్నికోరి స్త్రీలు ఆచరించే వ్రతాల్లో అత్యంత ప్రధానమైనది ... 'వటసావిత్రి వ్రతం'. ఇక ఈ వ్రతాన్ని 'జ్యేష్ట పూర్ణిమ' రోజున ఆచరిస్తూ వుంటారు. త్రయోదశి రోజున మొదలు పెట్టి పూర్ణిమ వరకూ అంటే మూడు రోజులపాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

వ్రతాన్ని ప్రారంభించే రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇల్లు శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టాలి. పూజా సామాగ్రితో 'మర్రిచెట్టు' దగ్గరికి వెళ్లి ... ఆ ప్రదేశాన్ని కూడా అలికి ముగ్గులు పెట్టాలి. మర్రిచెట్టు మొదట్లో బ్రహ్మ ... మధ్యభాగంలో విష్ణువు ... అగ్రభాగాన శివుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన మర్రిచెట్టు మొదట్లో, సావిత్రి - సత్యవంతులుగా భావించి రెండు పసుపుముద్దలను ఉంచాలి. ఆ తరువాత గణపతిని ... సావిత్రి - సత్యవంతులను, యమధర్మరాజును పూజించాలి.

ఇక ఇష్ట దేవతలను ... మర్రిచెట్టును ఆరాధించిన తరువాత 'నమో వైవస్వతాయ'అనే మంత్రాన్ని పఠిస్తూ, 108 ప్రదక్షిణలు చేయవలసి వుంటుంది. మర్రిచెట్టుకు దారాన్ని చుడుతూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. తమ శక్తి మేరకు నైవేద్యాలు సమర్పించి, ముత్తయిదువులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ విధంగా నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన, కోరిన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.


More Bhakti News