శ్రీ సంతోషిమాత వ్రతం
సంతోషమే సగం బలమన్నారు పెద్దలు ... ఎటువంటి కార్యాన్నయినా సంతోషంగా ప్రారంభిస్తే సగం విజయం చేకూరినట్టేనని కూడా చెప్పారు. సంతోషం ... సమస్త సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది. అది ఆరోగ్యంగా ఉంచుతుంది ... ఆయుస్షు పెంచుతుంది. కష్ట నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సంతోషం ఒక వరంగా కనిపిస్తుంది ... పన్నీటి జల్లై పలకరిస్తుంది. అలాంటి సంతోషాన్ని అందించడం కోసం అధిష్ఠాన దేవతగా అవతరించిన అమ్మవారే శ్రీ సంతోషిమాత.
ఇక సంతోషిమాత ఆవిర్భావం విషయానికి వస్తే ... ఆమె సాక్షాత్తు వినాయకుడి మానస పుత్రిక. ఒక రోజున శివుడి మానస పుత్రిక అయిన నాగదేవత, వినాయకుడికి రక్షాబంధనం కడుతూ ఉంటే, ఆయన ఇద్దరు కుమారులైన లాభక్షేమాలు తమ చేతికి కూడా రక్షా కంకణం కట్టమని నాగదేవతను కోరారు. రక్షాబంధనాన్ని సోదరితో మాత్రమే కట్టించుకోవాలని ఆమె చెప్పడంతో, తమకి సోదరి కావాలంటూ వాళ్లు వినాయకుడి దగ్గర మారాం చేయడం మొదలు పెట్టారు. దాంతో వినాయకుడు తన నేత్రముల నుంచి ఓ బాలికను ఆవిర్భవింప జేశాడు.
చతుర్భుజాలతో ... దివ్యాభరణాలతో చిరునవ్వులు చిందిస్తూ ఆ బాలిక వినాయకుడికి నమస్కరించింది. సంతోషాన్ని ప్రసాదించడానికి అవతరించినది కావునా 'సంతోషి'అని దేవతలంతా కలిసి నామకరణం చేశారు. లాభ క్షేమాలనే కాకుండా ... కోరిన వారికి కొంగు బంగారమై, ప్రతి ఇంటా సంతోషసిరులు కురిపించమని దేవతలంతా కోరడంతో అందుకామె అంగీకరించింది. సంతోషిమాతను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారి దరికి కష్టనష్టాలు చేరవని నారదమహర్షి సెలవిచ్చినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
ఇక పూర్వ కాలం నుంచి కూడా తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలనీ, ఆనందంతో కళకళలాడుతూ ఉండాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. ఈ వ్రతాన్ని చైత్ర .. వైశాఖ .. శ్రావణ .. భాద్రపద .. ఆశ్వీజ .. కార్తీక .. మార్గశిర .. మాఘ .. ఫాల్గుణ మాసాల్లో శుక్రవారం రోజున చేసుకుంటూ ఉంటారు. మరికొందరు శ్రావణమాసపు పౌర్ణమి రోజున చేస్తుంటారు.
ఈ వ్రతాన్ని ఆచరించే వారు ముందుగా పూజా మంటపంలో అమ్మవారి చిత్ర పటాన్ని ... మంచినీటి కలశాన్ని ఉంచాలి. కలశం పై అయిదు పల్లవములు కలిగిన మామిడి కొమ్మను ... దానిపై నారికేళమును ఉంచాలి. దీపారాధన ... ఆచమనం అనంతరం, గణపతి ప్రార్ధన చేసి సంకల్పం చెప్పుకోవాలి. పూర్ణ కలశ పూజలో భాగంగా వరుణదేవుడిని ధ్యానించాలి. నవగ్రహాలను పూజించిన అనంతరం అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి. అమ్మవారికి ఆసనాన్ని ... అర్ఘ్య పాద్యాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకం ... శుద్ధోదక స్నానం చేయించి పసుపు కుంకుమలను ... వస్త్రాభరణములను సమర్పించాలి.
అష్టోత్తర శతనామావళిచే అమ్మవారిని పూజించి ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి. సంతోషిమాత ఆశీస్సులను కోరుతూ హారతి పట్టాలి. తీర్థ ప్రసాదాల అనంతరం ఇంటికి వచ్చిన పేరంటాళ్ల ను సాక్షాత్తు అమ్మవారిగానే భావిస్తూ వాయనాలు ఇచ్చి పంపించాలి.