పాపాలను తరిమేసే దీపారాధన
తెలిసో ... తెలియకో ... చిన్నవో ... పెద్దవో పాపాలనేవి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతూనే వుంటాయి. అదే విధంగా దోషాలు కూడా సంక్రమిస్తూ వుంటాయి. అయితే ఆ పాపాల బారి నుంచి బయటపడాలంటే ఏ పూజలు చేయాలో ... దోషాలు తొలగిపోవాలంటే ఎలాంటి దానాలు చెయ్యాలోనని అందరూ సతమతమై పోతుంటారు. వాటి విధి విధానాలు తెలియక తికమక పడిపోతుంటారు.
ఇలా ఆందోళన చెందేవారికి శాస్త్రంలో చక్కని సమాధానం కనిపిస్తుంది. దైవ సన్నిధిలో దీపారాధన చేయడం వలన చాలా పాపాలు హరించి వేయబడతాయనీ, అనేక రకాల దోషాలు నశించిపోతాయని అంటోంది. దీపం జ్యోతి స్వరూపం ... జ్యోతి స్వరూపుడైన దైవానికి అది ప్రతీక. అలాంటి దీపాన్ని పూజా మందిరంలో వెలిగించడం వలన, చీకట్లే కాదు పాపాలు సైతం తరిమివేయబడతాయి.
సాధారణంగా విష్ణుమూర్తికి కుడి వైపున ... శివుడికి ఎడమవైపున ... ఇతర దేవతలకు ఎదురుగా దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. వైష్ణవ సంబంధమైన ఆలయాల్లో దీపారాధన చేయడం వలన సంపదలు కలుగుతాయి. శివాలయాల్లో దీపారాధన చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. శివకేశవులు కొలువుదీరిన క్షేత్రాల్లో దీపారాధన చేయడం వలన జన్మజన్మలనాటి పాపాలు కొట్టుకుపోతాయి.
దీపం ఎక్కడైతే నిత్యం వెలుగుతూ వుంటుందో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. దీపం లేని చోట అలక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంట్లోనైతే దీపం నిత్యం వెలుగుతూ వుంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. దీపారాధన వలన వెలుగే కాదు .. అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి ... అష్టైశ్వర్యాలు లభిస్తాయి.