దేవతలు దర్శించిన దివ్యక్షేత్రం
క్షీరసాగర మథనంలో అమృతం వెలికి వచ్చినప్పుడు అది అసురులకు దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో, శ్రీ మహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించాడు. లోక కల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన ఆ రూపాన్ని దేవతలంతా పూజించారు. వాళ్ల అభ్యర్థన మేరకు స్వామి అక్కడ అవతరించాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'మోహనపురం' అనే పేరు వచ్చింది.
ఇక్కడి స్వామి 'కాలమేఘ పెరుమాళ్' పేరుతో కొలవబడుతున్నాడు. అత్యంత పవిత్రమైనదిగా ... మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం,'తిరుమోగూర్' పేరుతో తమిళనాడు ప్రాంతంలో ... మధుర సమీపంలో అలరారుతోంది. నమ్మాళ్వార్ ... తిరుమంగై ఆళ్వార్ లచే కీర్తించబడిన ఈ క్షేత్రంలో అమ్మవారు మేఘవల్లి తాయారు ... మోహనవల్లి తాయారుగా పిలవబడుతోంది.
సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం మనసును మంత్రిస్తుంది. ఎత్తైన రాజగోపురం ... సుందరమైన ప్రాకారాలు ... కళ్ళను కట్టిపడేసే మంటపాలు ... ఆశ్చర్యచకితులను చేసే శిల్పకళ నాటి వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. 'తాళ తామరై' నదీ తీరంలో ఆవిర్భవించిన ఈ క్షేత్రాన్ని ఎంతోమంది రాజులు దర్శించారు ... ఆ స్వామి పట్ల అసమానమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఆయన సేవలో తరించారు.
అటు చారిత్రక నేపథ్యాన్ని ... ఇటు పురాణ ప్రాశస్త్యాన్ని కలిగివున్న ఈ క్షేత్రంలో క్షీరాబ్ది పుష్కరిణి దర్శనమిస్తుంది. ఈ పుష్కరిణి నీటిని తలపై చల్లుకున్నంత మాత్రానే సమస్త పాపాలు పటాపంచలవుతాయని అంటారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్నందు వల్ల, ఈ క్షేత్రానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడీ ఉంటూనే వుంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.