గురుపౌర్ణమి
గురువు యొక్క గొప్పతనాన్ని గురించి ... ఆయన అనుగ్రహం కారణంగా పొందే ఫలితాలను గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా పురాణాల్లో కనిపిస్తోంది. 'ఆషాడ శుద్ధ పౌర్ణమి'ని ... 'గురుపౌర్ణమి'అనీ ... 'వ్యాసపౌర్ణమి' అని అంటూ వుంటారు. ఇక వ్యాసభగవానుడు జన్మించిన పర్వదినాన ఈ గురుపూజా మహోత్సవం జరుపుకుంటూ వుంటారు. అందుకు కారణమైన సంఘటనను గురించి తెలుసుకుందాం.
పూర్వం కాశీలోని గంగానదీ తీరంలో వేదనిధి ... వేదవతి అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. అనునిత్యం దైవ చింతన చేస్తూ వాళ్లు ఆశ్రమ జీవితం గడిపేవారు. అయితే ఆ పుణ్య దంపతులను సంతానలేమి బాధిస్తూ వుండేది. అలాంటి పరిస్థితుల్లో ... వ్యాస భగవానుడు ప్రతి రోజు మధ్యాహ్న సమయంలో స్నానానికి గంగానది తీరానికి వచ్చి వెళుతున్నాడనే విషయం వేదనిధికి తెలిసింది. ఆ దివ్య పురుషుడు మాత్రమే తమకి సంతాన భాగ్యం కల్పించగలడని నమ్మిన వేదనిధి, ఆయన కోసం ప్రతి రోజు గంగానదీ తీరంలో వెదకసాగాడు.
ఒకరోజున గంగాతీరంలో సంచరిస్తోన్న ఓ వ్యక్తిని చూసి, ముఖ వర్చస్సు కారణంగా ఆయనే వ్యాస భగవానుడు అయ్యుంటాడని వేదనిధి భావించి ఆయన పాదాలను పట్టుకున్నాడు. తనని గుర్తించిన వేదనిధిని వ్యాసుడు అభినందించాడు. మరునాడు ఉదయం తన ఇంట్లో జరిగే పితృకార్యానికి భోక్తగా రావలసిందిగా వేదనిధి కోరడంతో, అందుకు ఆయన అంగీకరించాడు. ఆనందంతో ఇంటికి వెళ్లిన వేదనిధి జరిగినదంతా భార్యకి చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాడు.
మరునాడు ఉదయం వ్యాసభగవానుడు రాగానే ఆ దంపతులు ఆయనను మర్యాద పూర్వకంగా ఆహ్వానించి పితృకార్యాన్ని పూర్తిచేశారు. అనంతరం తమ సంతానలేమిని గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతులైనటువంటి సంతానాన్ని అనుగ్రహిస్తున్నట్టు ఆయన చెప్పడంతో సంతోషంతో పొంగిపోయారు. మరలా ఆయనను దర్శించుకుని పూజించుకునే మార్గం చెప్పమని కోరారు.
ఆధ్యాత్మిక పథంలో పవిత్రంగా నడచుకునే గురువుల్లోను, విజ్ఞానవంతులు ... వివేకవంతులు అయిన వారిలోను తనని చూసుకుని పూజించమనీ, తాను జన్మించిన 'ఆషాడ శుద్ధ పౌర్ణమి' రోజున ఈ పని చేసినట్టయితే తన అనుగ్రహం తప్పక ఉంటుందని వ్యాసభగవానుడు చెప్పాడు. ఆనాటి నుంచి విద్యా ... విజ్ఞాన సంపదను ఆశించేవారు గురుపూజను భక్తి శ్రద్ధలతో చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది.