కోరల పున్నమి
మార్గశిర పౌర్ణమిని 'కోరల పున్నమి'గా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటూ వుంటారు. కోరల అమ్మవారిని పూజించే పౌర్ణమి కనుక, ఈ రోజుని కోరల పున్నమిగా పిలుస్తుంటారు. ఇక ఈ కోరల అమ్మవారు, సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. ఈమెను కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రామదేవతగా పూజిస్తుంటారు.
జీవులు చేస్తోన్న పాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆ లెక్కల వివరాలను యమధర్మరాజుకి చిత్రగుప్తుడు తు. చ. తప్పకుండా చెబుతుంటాడు. ఆయన అందించే నివేదిక ఆధారంగానే యమధర్మరాజు ఆ జీవులకు శిక్షలు ఖరారు చేస్తుంటాడు. మరణానంతరం ఎవరైనా ఈ ఘట్టం దాటుకుని ముందుకు వెళ్లవలసిందేనని పురాణాలు చెబుతున్నాయి. అంతటి కీలకమైన ఈ ఘట్టంలో చిత్రగుప్తుడు ప్రధానమైన పాత్రను పోషిస్తాడు.
అలాంటి చిత్రగుప్తుడు ఒకానొక సమయంలో ...మార్గశిర పౌర్ణమి రోజున తన చెల్లెలిని పూజించిన వారికి నరక బాధలు ... అపమృత్యు భయం లేకుండా చేస్తానని మాట ఇచ్చాడట. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. ఈ కారణంగానే ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తూ వుంటారు. ఆమె అనుగ్రహం తమ కుటుంబంపై ఎల్లప్పుడూ వుండాలని ఆశిస్తూ ఆరాధిస్తూ వుంటారు. కోరికలను నెరవేర్చే అమ్మవారిని కొన్ని ప్రాంతాల్లో కోరలమ్మగా సంభోదిస్తూ వుండటం గమనించదగిన విషయం.