భగవంతుడి సాయం
ఓసారి పోతన అయన కుమారుడు మల్లన్న తమకి గల కొద్దిపాటి భూమిని దున్నసాగారు. అదే సమయంలో రాజుగారు ఇచ్చిన కానుకలను గ్రహించి, పల్లకీలో అటుగా వెళుతూ వాళ్లని చూస్తాడు శ్రీనాథుడు. తనకి సరస్వతీదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనే విషయాన్ని తెలియజెప్పాలనీ, దైవానుగ్రహాన్ని ఉపయోగించుకునే తెలివితేటలు కూడా ఉండాలనే సంగతిని స్పష్టం చేయాలని నిర్ణయించుకుంటాడు.
పోతన ఆయన కుమారుడు చూస్తూ వుండగా,శ్రీనాథుడు తన పల్లకీ మోసే బోయలను పక్కకి తప్పుకోమని చెబుతాడు. అలా చేస్తే ఆయన పడిపోతాడన్నట్టుగా వాళ్లు అయోమయంగా చూస్తారు. ఫరవాలేదని శ్రీనాథుడు చెప్పడంతో అలాగే పల్లకీని వదిలేస్తారు. అయితే పల్లకీ కింద పడిపోకుండా అలాగే గాలిలో తేలసాగింది.
పోతన వైపు గర్వంగా చూస్తూ దగ్గరికి వచ్చి, మండుటెండలో వాళ్లు మాడిపోతూ వ్యవసాయం చేస్తుండటం గురించి చులకనగా మాట్లాడతాడు శ్రీనాథుడు. తాను రాజుగారిని ఆశ్రయించడం వలన తనపై భగవంతుడికి ఎలాంటి ఆగ్రహం కలగలేదని అంటాడు. సుఖపడటం తెలియని వాళ్లే కష్టపడతారని ఎద్దేవా చేస్తాడు. దాంతో పోతన తన నాగలి నుంచి రెండు ఎద్దులను వేరుచేస్తాడు. శ్రీరాముడిని స్తుతిస్తూ నాగలికి నమస్కరిస్తాడు.
అంతే నాగలి దానంతట అది పొలమంతా దున్నసాగింది. ఆ పక్కనే గల పొలాల్లో పనిచేస్తున్న వాళ్లంతా ఈ వింతను చూసి ఆశ్చర్యపోతూ అక్కడికి చేరుకుంటారు. తాను నమ్మిన దైవం కూడా తాను కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోదనీ, అయితే అనవసరంగా ఆ దైవాన్ని తను ఇబ్బంది పెట్టనని చెబుతాడు పోతన. వంట్లో శక్తి ఉన్నంతవరకూ కష్టపడాలనీ, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి సాయం తీసుకోవాలని సెలవిస్తాడు. దాంతో ముభావంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు శ్రీనాథుడు.