సంపదలనిచ్చే క్షేత్రం
లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సంపదలు వుంటాయి ... సంతోషాలు వుంటాయి. ఇక ఆ తల్లి నృసింహస్వామి దేవేరిగా కొలువై వుంటే, అక్కడ సంపదలతో పాటు విరివిగా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ కారణంగానే లక్ష్మీ నృసింహస్వామి ఆలయాలు నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి ... సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంటాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'చెన్నూరు'కి చెందిన శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది.
అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం కృష్ణా జిల్లా పెడన మండలంలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో లక్ష్మీనృసింహస్వామి స్వయంభువు ... ఎందరో మహర్షులు ఇక్కడి స్వామిని ఆరాధించినట్టు చెబుతారు. అంతటి ప్రాచీనత ... మహాత్మ్యం గల స్వామి, రాజేశ్వరమ్మ అనే భక్తురాలి ద్వారా వెలుగు చూసినట్టు చెబుతారు.
పూర్వం రాజేశ్వరీ అనే భక్తురాలు అనునిత్యం స్వామివారిని ఆరాధిస్తూ వుండేది. ఆమె ఇచ్చిన విభూతి రోగులకు స్వస్థత చేకూర్చేది. సుధీర్గ కాలంగా బాధిస్తోన్న వ్యాధులు సైతం, ఆ విభూతి సేవనంతో తగ్గిపోయేవి. దాంతో అంతా ఆమెను దైవాంశ సంభూతురాలుగా తలచేవారు. ఆమెకి స్వప్నంలో స్వామివారు కనిపించి చెప్పడం వల్లనే శ్రీలక్ష్మీనృసింహస్వామివారి స్వయంభువు ప్రతిమ బయటపడింది.
ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. లక్ష్మీసమేతుడైన స్వయంభువు నృసింహుడు చూడచక్కని పరిమాణంలో మహా తేజస్సుతో వెలుగొందుతూ వుంటాడు. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విరాజిల్లుతుంటుంది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన దుష్ట శక్తుల వలన కలిగే భయాలు నశిస్తాయనీ, అనారోగ్యాలు తొలగి ఐశ్వర్యాలు కలుగుతాయని చెబుతుంటారు.
ప్రతియేటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారి అనుగ్రహాన్ని కోరుకుంటూ కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తుంటారు. నయన మనోహరంగా జరిగే సంబరాల్లో కుటుంబ సమేతంగా పాలుపంచుకుని పునీతులవుతుంటారు.