శ్రీవారి ప్రసాదం
ఎవరైనా ఎదురుపడి తాము తిరుమల వెళ్లి వచ్చినట్టుగా చెప్పగానే, మరి లడ్డూ ప్రసాదం ఏదని అడుగుతుంటాం. సాధారణంగా తిరుమల వెళ్లి వచ్చిన వాళ్లు లడ్డూ ప్రసాదాన్ని తప్పకుండా తమతో తెస్తుంటారు ... బంధుమిత్రులకు పంచుతుంటారు. ప్రసాదం ఎంత ఎక్కువ మందికి పంచితే అంతగా క్షేత్ర దర్శన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు సెలవిస్తున్నాయి. అందువలన దివ్య క్షేత్రాలను దర్శించిన వారు ప్రసాదం తీసుకురాకుండా వెనుదిరగరు.
ఇక తిరుమల వెళ్లిన వాళ్లు ముందుగా దైవ దర్శనం పైన ... ఆ తరువాత లడ్డూ ప్రసాదం పైనే దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. లడ్డూ చేతిలో పడినప్పుడు గాని వారి మనసు కుదుట పడదు. ఇంతటి వత్తిడికి కారణం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి గల ప్రత్యేకత ... విశిష్టత అని చెప్పొచ్చు. అశేష భక్త జన వాహినీ మనసు దోచిన ఈ లడ్డూ ప్రసాదం, తొలినాళ్లలో ఇక్కడ వుండేది కాదని తెలిస్తే చాలామంది ఆశ్చర్య పోతారు.
తొలినాళ్లలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు లేవు గనుక, ప్రసాదాలతోనే భక్తులు ఆకలి తీర్చుకునే వాళ్లు. అదే ఉద్దేశంతో అప్పట్లో ఆలయ నిర్వాహకులు'తిరుప్పొంగం' అనే ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టే వాళ్లు. ఆ తరువాత కాలంలో అప్పం ... వడ .. సుఖీయం ... అత్తిరసం ... వంటి ప్రసాదాలు పంచడం ప్రారంభించారు. అయితే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, నిల్వ వుండే 'వడ'ని ఇంటికి తీసుకు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారట. అది గుర్తించిన ఆలయ నిర్వాహకులు ప్రసాదాలను విక్రయించడం ఆరంభించారు.
భక్తులకు వడతో పాటు తీపి బూందీని అమ్మేవారు. ఈ తీపి బూందిని లడ్డూగా చేసే అమ్మితే బాగుంటుందనే ఆలోచన అప్పుడే వచ్చింది. అలా 1940 నుంచి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించడం మొదలైంది. సాధారణంగా తిరుపతి లడ్డూలు 'ఆస్థాన లడ్డూలు' ... 'కల్యాణోత్సవ లడ్డూలు' ... 'ప్రోక్తం లడ్డూలు' గా కనిపిస్తుంటాయి. విశేష ఉత్సవాల సందర్భంలో గౌరవ అతిథులకు పంచే లడ్డూలను ఆస్థాన లడ్డూలనీ, ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు అందజేసే వాటిని కళ్యాణోత్సవ లడ్డూలని అంటారు. ఇక సాధారణ దర్శనం చేసుకున్న భక్తులకు అందజేసే లడ్డూలను ప్రోక్తం లడ్డూలని అంటారు.
భక్తుల సంఖ్యతో పాటు ఇక్కడ లడ్డూల తయారీ కూడా రోజు రోజుకీ పెరిగిపోతూ వస్తోంది. 1950 లో రోజుకి వెయ్యి లడ్డూలు తయారు చేస్తే, 1990 నాటికి రోజుకి లక్ష లడ్డూలు చేయవలసి వచ్చింది. జీడిపప్పు .. ఎండుద్రాక్ష .. యాలకులు .. కలకండ కలిపి తయారు చేసే ఈ లడ్డూ ప్రసాదం మాటల్లో చెప్పలేనంత మధురంగా వుంటుంది. కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామికి సాటి అయిన దైవం లేదన్నట్టుగానే, ఇక్కడి ప్రసాదానికి కూడా సాటి లేదనేది భక్తులందరూ అనుకునే మాట.