మదిమదిలో మహాదేవుడు
ఎవరైనా సరే తమ కష్టాలను ... బాధలను బంధుమిత్రులతో చెప్పుకుంటారు. అయితే వాటిని తీర్చమంటూ భగవంతుడినే వేడుకుంటారు. దైవం అంతటా ఉన్నప్పటికీ ఆయన వీలైనంత విశ్వాసాన్ని కలిగించేది ఆలయంలోనే కాబట్టి, అంతా అక్కడికి వెళ్లి తమ ఆవేదనను విన్నవించుకుంటూ వుంటారు. దైవ సన్నిధిలో మానసికమైన ప్రశాంతతను ... దేవుడున్నాడనే ధైర్యాన్ని పొందుతుంటారు.
సాధారణంగా ఏ దేవాలయానికి కూడా భక్తులను రమ్మంటూ ఎవరూ కూడా పనిగట్టుకుని ఆహ్వానించరు. అక్కడ భోజన సౌకర్యాల వంటివి కల్పించరు. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా నిజామాబాద్ జిల్లా 'మద్దికుంట' గ్రామ ప్రజలు కనిపిస్తారు. వీరంతా తమ దేవుడిని దర్శించమని భక్తులను ఆహ్వానిస్తారు ... అక్కడ భోజన సౌకర్యం వుందని మరీ చెబుతారు. అలా అని చెప్పేసి అది ఎలాంటి చరిత్ర లేని ఆలయం కాదు.
ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు శ్రీ రాముడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి స్వామిని బుగ్గ రామలింగేశ్వరుడిగా స్థానికులు కొలుచుకుంటూ వుంటారు. అయితే ఇంత ప్రాశస్త్యం గల ఆలయానికి భక్తులు రాకపోవడం గ్రామ ప్రజలను బాధించింది. అటవీ ప్రదేశం కావడం ... ఇక్కడ భోజన సౌకర్యం లేకపోవడం అందుకు కారణమని అంతా భావించారు. ఊళ్లోని ప్రతి ఇంటి నుంచి ధాన్యం ... కూరగాయలు ఆలయానికి సమర్పించాలని నిర్ణయించుకున్నారు.
ఆలయానికి వచ్చే రహదారిని కూడా బాగుచేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆలయానికి ప్రచారం కల్పించారు. దాంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. ఇక్కడి ఆలయాన్ని దర్శించే వారి సంఖ్య ... శివదీక్షలు తీసుకునే వారి సంఖ్య ... అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసే వారి సంఖ్య పెరిగిపోయింది.
గ్రామస్తులు తమ విరాళాలను మరికొంత పెంచి భక్తుల రద్దీని తట్టుకుంటున్నారు. గ్రామస్తులు తమ ఖర్చు గురించి ఆలోచించరు ... తమ ఊరు ఆలయం భక్తులతో సందడిగా వుండటం చూసి సంతోషంతో పొంగిపోతుంటారు. అందుకే ఇక్కడి వారి మనసు మనసులో మహాదేవుడు దర్శనమిస్తుంటాడు ... ఆత్మీయతానురాగాలతో అనుగ్రహిస్తుంటాడు.