పూజ చేసిన తరువాత ?
ఉదయాన్నే స్నానం చేసి ఇష్ట దైవానికి పూజ చేస్తే మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పూజా మందిరంలో చేసిన దీపారాధన వెలుగుతో పాటు పవిత్రతను వెదజల్లుతూ వుంటుంది. ఫలితంగా ఇల్లంతా ఒకరకమైన తేజస్సును పొందుతుంది. దైవాన్ని ఆరాధించడం వలన కలిగే మానసిక ప్రశాంతత వలన, అనారోగ్యాలు దూరమవుతాయి.
దేవుడిని పూజించే బయలుదేరాం కాబట్టి ఆ రోజున పనులన్నీ చకచకా పూర్తవుతాయనే విశ్వాసం బలంగా వుంటుంది. ఈ విశ్వాసమే అడుగు ముందుకు వేసేలా చేసి కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దైవాన్ని పూజిస్తూ ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ వుంటారు. సాధారణంగా పూజలో అష్టోత్తరాలు ... సహస్రనామాలు ... స్తోత్రాలు వంటి వాటిని చదువుతుంటారు.
ఇక తీరుబడిగా వున్న వాళ్లు షోడశోపచారాలతో పూజను పూర్తి చేస్తుంటారు. పూజ పూర్తికాగానే తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్లిపోతుంటారు. అయితే దైవాన్ని ఏవిధంగా అర్చించినా, పూజ పూర్తి అయినట్టుగా స్వస్తి వాక్యం చెప్పాలని శాస్త్రం చెబుతోంది. 'సర్వేజనా సుఖినో భవంతు' అని గానీ, 'కృష్ణార్పణ మస్తూ' అని గాని స్వస్తి చెప్పవలసి వుంటుంది. అలా స్వస్తి వాక్యం తప్పని సరిగా చెప్పాలనీ, అప్పుడే పూజ పూర్తి చేసిన ఫలితం కలుగుతుందనే విషయాన్ని శాస్త్రం స్పష్టం చేస్తోంది.