దేవతలు నడయాడిన నడకుదురు
సాక్షాత్తు శ్రీ కృష్ణుడే దేవలోకం నుంచి పాటలీ మొక్కలను తెచ్చి నాటిన పుణ్య స్థలం 'నడకుదురు'. లోక కల్యాణానికి కారణమైన ఈ క్షేత్రం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో విరాజిల్లుతోంది. ద్వాపరయుగానికి ముందుగానే ఈ ప్రదేశంలో పరమశివుడు 'పృథ్వీశ్వరుడు'గా వెలిశాడు. ఆ తర్వాత లక్ష్మీ నారాయణులు కూడా ఈ ప్రదేశంలో ఆవిర్భవించారు.
ఇక ద్వాపర యుగంలో నరకాసురుడు ముల్లోకాలను గజగజ లాడించసాగాడు. అందులో భాగంగానే 'ద్విముఖుడు' అనే బ్రాహ్మణుడిని చంపేశాడు. అయితే ఆ పాపపరిహారార్థం శివుడి అనుగ్రహాన్ని కోరుతూ ఈ క్షేత్రంలో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నరకుడి ఆగడాలు మితిమీరి పోవడంతో వాడిని సంహరించడానికి శ్రీ కృష్ణుడు సిద్ధపడ్డాడు.
సత్యభామా సమేతుడైన శ్రీ కృష్ణుడు, నరకాసురుడిని ఈ ప్రదేశంలోనే ఎదిరించి నిలిచాడు. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి రోజున సత్యభామ చేతిలో నరకుడి సంహారం జరిగేలా చేశాడు. ఈ సందర్భంగానే ప్రజలంతా 'దీపావళి' పండుగ జరుపుకుంటూ వుంటారు. నరకాసుర సంహారం జరిగిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి 'నరకుదురు'అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది 'నడకుదురు'గా మారిందని చెబుతుంటారు.
ఈ సంఘటన తరువాత శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి ఇక్కడి లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజించాడట. ఆ తరువాత ఈ పుష్పాలు గల మొక్కలను దేవలోకం నుంచి తెచ్చి నాటినట్టుగా చెబుతుంటారు. ఈ పాటలీ చెట్లు కాశీ తరువాత తిరిగి ఈ ప్రదేశంలో మాత్రమే కనిపించడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. కార్తీక మాసం శివ కేశవులకు ప్రీతి కరమైనది కాబట్టి, భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. దైవదర్శనం చేసుకుని వన భోజనాలు చేసి వెళుతుంటారు.