ఏడుకొండల స్వామి
తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే ఏడుకొండలను అధిరోహించవలసిందే. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకోవాలంటే, సప్త ద్వారాలను దాటవలసి వుంటుంది. ఆ సప్త ద్వారాలనే ఏడుకొండలుగా చెబుతుంటారు. ఈ ఏడుకొండలు 'శేషాద్రి' ... 'గరుడాద్రి' ... 'వేంకటాద్రి' ...' నారాయణాద్రి' ... 'అంజనాద్రి' ... 'నీలాద్రి' ... 'వృషభాద్రి' గా పేర్కొనబడుతున్నాయి.
భక్తులు ''గోవిందా'' అని గొంతెత్తి పిలుస్తూ ఈ కొండలను అధిరోహించే శక్తిని తమకి ప్రసాదించమని కోరుతుంటారు. ఆ స్వామి కారణంగానే వయసుపైబడిన వాళ్లు ... అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు సైతం ఈ కొండలపై కాలి నడకన ఆ తిరుమలేశుడిని చేరుకుంటూ వుంటారు. ఇక ఈ కొండలకు ఈ పేర్లు రావడానికి వెనుక భగవంతుడితో ముడిపడిన బలమైన కారణాలే కనిపిస్తుంటాయి.
పూర్వం ఆదిశేషుడికి ... వాయుదేవుడికి మధ్య తమలో ఎవరు గొప్ప అనే విషయంలో మాటామాటపెరిగింది. అప్పుడు వాయుదేవుడు తన శక్తిని ప్రదర్శించగా, ఆ ధాటికి తట్టుకోలేక పోయిన ఆదిశేషుడు పర్వతానికి చుట్టుకున్నాడు. అయితే పర్వతంతో సహా ఆదిశేషుడు ఎగిరొచ్చి ఈ ప్రదేశంలో పడ్డాడు. ఆ తరువాత ఈ పర్వతానికి తన పేరు స్థిరపడేలా స్వామి అనుగ్రహాన్ని పొందాడు. ఫలితంగా ఈ పర్వతానికి శేషాద్రి అనే పేరు వచ్చింది.
ఇక శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు ఆయన క్రీడాద్రిని గరుత్మంతుడు ఈ ప్రదేశానికి తీసుకు వచ్చాడు. అందుకు కృతజ్ఞతగా ఆ పర్వతం గరుత్మంతుడి పేరుతో ప్రసిద్ధి చెందుతుందని స్వామివారు వరాన్ని ప్రసాదించారు. ఆనాటి నుంచి ఇది 'గరుడాద్రి' గా స్వామివారిని సేవిస్తూ వస్తోంది. వేంకట అంటేనే కష్టాలను తొలగించేవాడు ... పాపాలను హరించేవాడని అర్థం. అలాంటి పాపాలను హరించే శక్తిని కలిగి వున్న పర్వతం 'వేంకటాద్రి' గా భక్తులచే ఆరాధించబడుతోంది.
ఇక నారాయణాద్రి విషయానికే వస్తే, నారాయణుడు అనే మహర్షి తపస్సు చేసి, ఈ పర్వతం తన పేరుతో ప్రసిద్ధి చెందాలని స్వామివారిని కోరాడట. స్వామి ఆ వరాన్ని ఇవ్వడంతో ఈ పర్వతానికి నారాయణాద్రి అనే పేరు వచ్చింది. ఇక అంజనాదేవి ఇక్కడి పర్వతంపై వాయుదేవుడిని గురించి తప్పస్సు చేసి హనుమంతుడిని పుత్రుడిగా పొందింది. అందువలన ఈ పర్వతం అంజనాద్రిగా పిలవబడుతోంది.
ఇక నీలాంబరి అనే భక్తురాలిని స్వామి అనుగ్రహించిన కారణంగా ఈ ప్రదేశంలోని పర్వతాన్ని 'నీలాద్రి'గా పిలుస్తుంటారు. వృషభాద్రి విషయానికే వస్తే, స్వామి చేతిలో సంహరించబడుతూ వృషభాసురుడు అనే రాక్షసుడు ఆ పర్వతం తన పేరుతో పిలవబడేలా వరాన్ని కోరాడట. స్వామి అనుగ్రహించడం వలన ఈ పర్వతానికి ఆ పేరు వచ్చింది. అలా కొలువుదీరిన ఈ ఏడు కొండలు అటు స్వామివారి సేవలోను ... ఇటు భక్తుల సేవలోను తరిస్తూ చరితార్థమవుతున్నాయి.