పాపాలను తరిమేసే పరమేశ్వరుడు
సదాశివుడు తన భక్తులను సదా కాపాడుతూనే వుంటాడు. కోరిన వరాలను ప్రసాదిస్తూ తన భక్తుల జీవితంలో సంతోషాలు నింపుతుంటాడు. తనకి ఖరీదైన కానుకలు సమర్పించుకోలేక నిరుపేద భక్తులు చిన్నబుచ్చుకో కూడదనే ఉద్దేశంతోనే ఆయన అభిషేక జలంతో ... మారేడు దళాలతో సరిపెట్టుకుంటూ వుంటాడు. మంచువంటి మనసున్నవాడు కావడం వల్లనే మహాశివుడుని అంతా ఆరాధిస్తుంటారు ... అమితంగా ప్రేమిస్తుంటారు.
ఇక ఆయనని సేవించడానికి ... తరించడానికి కార్తీకమాసం మరింత విశిష్టమైనదని పురాణాలు చెబుతుండటం వలన, ఈ మాసంలో ఆయన ఆలయాలు ... ముఖ్యంగా నదీ తీరంలో గలవి భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి విశ్వేశ్వరుడి ఆలయం మనకి తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం సమీపంలో గల 'ఊడిపూడి'లో దర్శనమిస్తుంది.
గోదావరి నదీ తీరంలో ప్రసిద్ధి చెందినటు వంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతిచేరువలో ఈ శివాలయం వుండటం విశేషం. ఈ కారణంగా కార్తీక మాసంలో శివకేశవులను వెంటవెంటనే భక్తులు దర్శించుకునే అవకాశం వుంది. ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రదేశంలో ... ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరి కనిపిస్తుంది. గర్భాలయంలో శివుడు మహా తేజస్సును కలిగివుంటాడు. ప్రతి నిత్యం పూజాభిషేకాలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు.
ఇక గర్భాలయానికి ఓ వైపున సుబ్రహ్మణ్యస్వామి మందిరం కనిపిస్తుంది. అడిగినదే తడవుగా ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి సంతానాన్ని అనుగ్రహిస్తాడని స్థానికులు చెబుతుంటారు. స్వామి ఆశీర్వాదం కారణంగా సంతానాన్ని పొందిన వారు ఆయనకి అభిషేకాలు జరిపిస్తుంటారు ... మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఇక ఇక్కడి శివయ్యను దర్శించుకోవడానికి కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. శివయ్య దర్శన భాగ్యం వలన సమస్త పాపాలు తరిమివేయబడతాయనీ, పుణ్యాలు వరదలా దరిచేరతాయనే విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.