పాపానికి ఫలితం!
ఉన్నతమైన కుటుంబానికి చెందిన పుండరీకుడిని కళావతి అనే వెలయాలికి పరిచయం చేస్తాడు రంగదాసు. ఆమె తన అందచందాలతో పుండరీకుడిని తన వలలో వేసుకుంటుంది. మాయమాటలతో అతణ్ణి పూర్తిగా తన వశం చేసుకుంటుంది. ఆమె వ్యామోహంలో పడిన పుండరీకుడికి, హితవు చెప్పే తల్లిదండ్రులు ... భార్య శత్రువుల్లా కనిపిస్తారు. తన విలాసాలకి అడ్డుపడుతున్న తల్లిదండ్రులను ... భార్యను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు.
పుండరీకుడు తన ఇల్లును కళావతి పేరున రాసి ఇచ్చేస్తాడు. ఇక పుండరీకుడి దగ్గర ఆస్తిపాస్తులు లేవని తెలిసి కళావతి అతణ్ణి దూరం పెడుతుంది. ఆమె నిజస్వరూపాన్ని జీర్ణించుకోలేకపోయిన పుండరీకుడు కూడా ఆ ఊరు విడిచి వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న కళావతి ఆనందంతో పొంగిపోతుంది. అయితే నిరంతరం దైవ ధ్యానం చేసుకునే పుండరీకుడి తల్లిదండ్రులు నివశించిన ఆ ఇంటికి ఆమె విటులను ఆహ్వానించడాన్ని ఆ దేవుడు సహించలేకపోతాడు.
ఫలితంగా పుండరీకుడి ఇంటి విషయంలో కళావతి - రంగదాసు మధ్య గొడవలు వస్తాయి. కళావతి ధోరణి రంగదాసుకి కనువిప్పు కలిగిస్తుంది. పుండరీకుడి జీవితాన్ని అస్తవ్యస్తం చేసినందుకు అతను బాధపడతాడు. ఈ నేపథ్యంలో విషయం పెద్దమనుషుల వరకూ వెళ్లడంతో కళావతికి గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తారు. కళావతి చేసిన పాపానికి అదే సరైన శిక్షంటూ ఆమెను గ్రామం నుంచి పంపించి వేస్తారు.