Corona Virus: వియత్నాంలో కొత్త కరోనా వేరియంట్... గాల్లో వేగంగా వ్యాపిస్తున్న ప్రమాదకారి

  • భారత్, బ్రిటన్ వేరియంట్ల కలయికగా వియత్నాం వేరియంట్
  • వియత్నాంలోని 30 ప్రావిన్స్ లలో వ్యాప్తి
  • ఇతర వేరియంట్లకు భిన్నంగా ఉందన్న పరిశోధకులు
  • ప్రమాదకర మ్యుటేషన్ అని వెల్లడి
New corona variant identified in Vietnam

2019 నవంబరులో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ఇప్పటివరకు అనేక విధాలుగా జన్యు ఉత్పరివర్తనాలకు లోనై మానవాళి పాలిట పెనుముప్పుగా మారింది. ఈ క్రమంలో గాల్లో వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ ను వియత్నాంలో కనుగొన్నారు. భారత్, బ్రిటన్ లో కనిపించిన వేరియంట్ల కలయికగా కనిపిస్తున్న ఈ కొత్త వేరియంట్ ను వియత్నాం పరిశోధకులు గుర్తించారు. వియత్నాంలో ఈ వైరస్ కొంతమందికి సోకినట్టు వెల్లడైంది.

మిగిలిన కరోనా వైరస్ వేరియంట్ల కంటే ఇది అమితవేగంతో వ్యాపిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇది గాల్లో కూడా అధికవేగంతో వ్యాపిస్తున్నందున ఈ మ్యుటేషన్ ఎంతో ప్రమాదకరమైనదని భావిస్తున్నామని వారు తెలిపారు. వియత్నాంలోని 30 ప్రావిన్స్ లలో 63 మున్సిపాలిటీల పరిధిలో ఈ కొత్త వేరియంట్ ఉనికి వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక ఇప్పటివరకు కొన్నివేల మ్యుటేషన్లను గుర్తించారు. వాటిలో చాలావరకు ఏమంత ప్రమాదకరం కాదు. కొన్నిమాత్రం అధికంగా వ్యాప్తిచెందుతూ ప్రజల ఆరోగ్యం పాలిట ఆందోళనకరంగా పరిణమిస్తుంటాయి.

More Telugu News