Jameer: ఆదిలాబాద్ జిల్లాలో జమీర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

  • ఈ నెల 18న జమీర్ పై కాల్పులు జరిపిన ఫారుఖ్
  • ఈ ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో మృతి
  • ఫారుఖ్ ను పార్టీ నుంచి తొలగించిన ఎంఐఎం
Tension raises at Jameers house

ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఫారుఖ్ అహ్మద్ ఈ నెల 18న సయ్యద్ జమీర్ అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపారు. జమీర్ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. దీంతో జమీర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫారుఖ్ అహ్మద్ ను, అతనితో పాటు ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని జమీర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

మరోవైపు అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ఫారుఖ్ ను ఎంఐఎం పార్టీ బహిష్కరించింది. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లా శాఖను ఆ పార్టీ రద్దు చేసింది.

More Telugu News