jagapathibabu: 'పటేల్ సార్'గా జగపతి అదరగొట్టేశాడట!

జగపతిబాబు కథానాయకుడిగా నటించిన 'పటేల్ సార్' .. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జగపతిబాబుకి గల క్రేజ్ కారణంగా థియేటర్స్ దగ్గర బాగానే సందడి కనిపించింది. ఈ సినిమాలో జగపతిబాబు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సుభాష్ పటేల్ గా .. డాక్టర్ వల్లభ్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు.

 ఈ సినిమా చూసిన ప్రేక్షకులు జగపతిబాబు నటనపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రిగా .. కొడుకుగా ఆయన అద్భుతంగా నటించాడని అంటున్నారు. పాత్ర పరిధి దాటకుండా ఈ రెండు పాత్రలకి న్యాయం చేశాడని చెబుతున్నారు. జగపతిబాబు కెరియర్లో ఇది ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్త దర్శకుడు వాసు పరిమికి కూడా మంచి మార్కులు పడిపోతుండటం విశేషం.    

More Telugu News